Cocaine | ముంబైలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్ పట్టివేత
Cocaine | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నుంచి 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Cocaine | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నుంచి 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులను అభినందించారు.
డ్రగ్స్ రవాణాకు పాల్పడే ముఠాలను ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముంబై నగరంలో రూ. 1745 కోట్ల విలువ చేసే 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక చిన్న సరుకును గుర్తించి.. దాన్నుంచి ఒక భారీ నెట్‌వర్క్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. కాగా.. ఆపరేషన్ గ్లోబల్ హంట్‌లో భాగంగా అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీమ్ డోలాను ఇటీవల టర్కీ నుంచి ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సలీమ్ డోలాను ఎన్సీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
We are resolved to ruthlessly crush the narcotics cartel.
The @narcoticsbureau has cracked down on a major international narcotics ring seizing 349 kgs of High-Grade cocaine worth Rs.1745 crore in Mumbai. This is a trailblazing example of bottom to top approach where the agency…
— Amit Shah (@AmitShah) May 1, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanjay Dutt | మంత్రి సమక్షంలోనే.. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన బాలీవుడ్ స్టార్
సెప్టెంబర్ 7, 2026

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
సెప్టెంబర్ 4, 2026

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం



