త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGS RTC | 23 నుంచి ఆర్టీసీ డ్రైవ‌ర్, శ్రామిక్ పోస్టుల‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌, డ్రైవింగ్ టెస్ట్‌..

TGS RTC | టీజీఎస్ ఆర్టీసీలో (TGS RTC) డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకున్న‌ది. ఈ నెల 23 నుంచి అభ్య‌ర్థుల ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

G

Telangana | Published On Apr 10, 2026, 6.54 am IST

TGS RTC | 23 నుంచి ఆర్టీసీ డ్రైవ‌ర్, శ్రామిక్ పోస్టుల‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌, డ్రైవింగ్ టెస్ట్‌..
Advertisement

TGS RTC | త్రినేత్ర‌.న్యూస్‌: టీజీఎస్ ఆర్టీసీలో (TGS RTC) డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకున్న‌ది. ఈ నెల 23 నుంచి అభ్య‌ర్థుల ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేర‌కు పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మేడ్చల్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ వేదికగా ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. డ్రైవర్‌ పో స్టులకు 28,903 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారికి శారీరక కొలతల పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, డ్రైవింగ్‌ పరీక్షలు ఉంటాయన్నారు.

అదేవిధంగా శ్రామిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 25,998మంది అభ్యర్థులకు వెయిటేజీ మార్కుల కేటాయింపు, ధ్రువపత్రాల పరిశీలన మాత్రమే నిర్వహిస్తామ‌ని తెలిపారు. అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్‌ కార్డులను ఈనెల 13 నుంచి 22వ తేదీ అర్ధ‌రాత్రి వరకు www.tgprb.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. అభ్యర్ధులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ ప్రతులను తప్పనిసరిగా తీసుకుని రావాలని చెప్పారు.

కాగా, ఆర్టీసీలో 1000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌ పోస్టులు భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 అక్టోబరు 8 నుంచి 28 వరకు దరఖాస్తుల‌ను స్వీక‌రించింది. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement