త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin | కరీంనగర్‌ పాదయాత్రకు నేనొస్తా.. బండికి నితిన్‌ నబిన్‌ హామీ

Nitin Nabin | తెలంగాణలో బీజేపీకి మరింత బలం చేకూర్చే దిశగా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ స్వయంగా పాల్గొననున్నారు.

P

Telangana | Published On Nov 6, 2026, 9.10 pm IST

Nitin Nabin | కరీంనగర్‌ పాదయాత్రకు నేనొస్తా.. బండికి నితిన్‌ నబిన్‌ హామీ
Advertisement

Nitin Nabin | తెలంగాణలో బీజేపీకి మరింత బలం చేకూర్చే దిశగా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ స్వయంగా పాల్గొననున్నారు. ఛఠ్ పూజ ముగిసిన అనంతరం కరీంనగర్‌కు వచ్చి పాదయాత్రలో భాగస్వామినవుతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు హామీ ఇచ్చారు. కరీంనగర్‌లో పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఉందని ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం బండి సంజయ్‌.. నితిన్‌ నబిన్‌తో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, సంస్థాగత బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

తెలంగాణలో బీజేపీని మరింత విస్తరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్‌, ఇండీ కూటమి చేస్తున్న ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టడంతోపాటు.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)పై వాస్తవాలను వివరించేందుకు కరీంనగర్‌లో మహా పాదయాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్‌ జాతీయ అధ్యక్షుడికి వివరించారు. ఈ నెల 5నే కరీంనగర్‌కు రావాల్సి ఉన్నప్పటికీ ఇతర కార్యక్రమాల కారణంగా పర్యటన సాధ్యం కాలేదని నితిన్‌ నబిన్‌ పేర్కొన్నారు. ఛట్‌ పూజ అనంతరం పర్యటనకు వచ్చి పాదయాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఈ పర్యటనతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

Advertisement
Advertisement