Manne Krishank | సీఎం రేవంత్ కూతురు స్కూల్లో ఫీజెంత తెలుసా?: మన్నె క్రిశాంక్
Manne Krishank | సీఎం రేవంత్‌రెడ్డి కూతురు నైమిషారెడ్డికి చెందిన కార్పొరేట్ స్కూల్లో ఒక్కో విద్యార్థి నుంచి రూ.2.5 లక్షల ఫీజు వసూలు చేసేందుకు నిర్ణయించారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
Manne Krishank | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి కూతురు నైమిషారెడ్డికి చెందిన కార్పొరేట్ స్కూల్లో ఒక్కో విద్యార్థి నుంచి రూ.2.5 లక్షల ఫీజు వసూలు చేసేందుకు నిర్ణయించారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. సదరు స్కూల్‌ను నిబంధనలకు విరుద్ధంగా ప్లే గ్రౌండ్ కూడా లేకుండా కడుతున్నారన్నారు. స్కూల్ నిర్మాణం కూడా పూర్తి కాకముందే వచ్చే సంవత్సరం అడ్మిషన్లు ఓపెన్ అయినట్లు వెబ్‌సైట్‌లో పెట్టారని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
విద్య సేవంటడు.. కానీ వ్యాపారం చేస్తడు
రేవంత్ రెడ్డి ఏమో విద్య వ్యాపారం కాదు, విద్య సేవ అని అంటాడు. ఆయన సొంత కూతురు కడుతున్న కార్పొరేట్ స్కూల్‌లో రూ.2.5 లక్షల ఫీజు తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర సంపద పెరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి కుటుంబ సంపద పెరిగింది. మేడ్చల్ జిల్లా సర్వే నంబర్ 87లో రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తోంది. కొల్లూరులో కూడా కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది భూమి కొని, ఈ ఏడాదిలో నిర్మాణం చేశారు.
అక్కడ, ఇక్కడ డైరెక్టర్స్ వాళ్లే..
ఈ నిర్మాణాల కోసం మైండ్‌వాల్ట్ అనే సంస్థను సృష్టించారు. అందులో దుంప శిరీష భాగస్వామిగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదు.. కానీ కార్పొరేట్ స్కూళ్లు మాత్రం పెద్ద ఎత్తున కడుతున్నారు. ఈ స్కూల్లో ఉన్న డైరెక్టర్స్ అంతా కూడా మెడికోవర్ హాస్పిటల్‌లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. అక్కడ వచ్చే డబ్బును తెచ్చి స్కూల్స్ కట్టి పిల్లల దగ్గర ఫీజుల రూపంలో డబ్బులు దోపిడీ చేస్తారు.
రేవంత్‌రెడ్డి చేసేవన్నీ ఆరోపణలే. కేసీఆర్ పొలం 1000 ఎకరాలంటరు.. ఆధారం లేదు. సూస్తే 67 ఎకరాలే ఉంటది. సెక్రెటేరియట్ కింద ఖజానా తీస్కొని పోయిర్రు కేసీఆర్, కేటీఆర్ అంటరు.. ఆధారం లేదు. కానీ మేం ఆధారం చూపిస్తున్నం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఏం చేసిండు అని అడిగితే వాళ్ల అమ్మాయి కార్పొరేట్ స్కూల్ నిర్మాణం చేసింది అని చెప్పొచ్చు.
తాజావార్తలు
- ●Jantar Mantar Protest Site Denotified | జంతర్ మంతర్ వద్ద ఇక ధర్నాలు బంద్: నిరసనలకు 3 కొత్త వేదికలను ఖరారు చేసిన ఢిల్లీ పోలీసులు
- ●Cyber Crime | 'నో' అంటే.. ఖాతా ఖాళీ! ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!
- ●Dirty Picture 2 | పదిహేనేళ్ల తర్వాత డర్టీ పిక్చర్‌కు సీక్వెల్ - స్టార్ హీరోయిన్ నుంచి వేశ్యగా మారిన నటి కథతో..
- ●CP Sajjanar | సాంస్కృతిక సామరస్యానికి ప్రతీక ‘నాడహబ్బ’
- ●Jaggareddy | రాహుల్ గాంధీకి మద్దతుగా మనం వీధుల్లోకి రావాల్సిందే
- ●CJI Surya Kant | రాహుల్, ఖర్గేలకు సీజేఐ షాక్: వ్యక్తిగత భేటీ కుదరదు.. న్యాయ నైతికతకు విరుద్ధమంటూ సూర్యకాంత్ కీలక లేఖ

Jantar Mantar Protest Site Denotified | జంతర్ మంతర్ వద్ద ఇక ధర్నాలు బంద్: నిరసనలకు 3 కొత్త వేదికలను ఖరారు చేసిన ఢిల్లీ పోలీసులు

Cyber Crime | 'నో' అంటే.. ఖాతా ఖాళీ! ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!

Dirty Picture 2 | పదిహేనేళ్ల తర్వాత డర్టీ పిక్చర్‌కు సీక్వెల్ - స్టార్ హీరోయిన్ నుంచి వేశ్యగా మారిన నటి కథతో..

CP Sajjanar | సాంస్కృతిక సామరస్యానికి ప్రతీక ‘నాడహబ్బ’




