CS Sanjay Jaju | ఎట్టిపరిస్థితుల్లో వరి వేయొద్దు.. రైతులకు చెప్పండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
CS Sanjay Jaju | వచ్చే యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లో వరి వేయొద్దని.. కలెక్టర్లు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
- యాసంగిలో వరి కంటే స్వల్పకాలిక పంటలే మేలు
- తక్కువ నీటితో తక్కువ కాలంలో పండే పంటలను ఎంచుకోవాలి
- రైతు నేస్తం 110వ ఎపిసోడ్‌లో సీఎస్ సూచనలు
CS Sanjay Jaju | త్రినేత్ర న్యూస్: వచ్చే యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లో వరి వేయొద్దని.. కలెక్టర్లు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. వరి కంటే స్పల్పకాలిక పంటల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రబీ సీజన్‌లో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు మరింత అడుగంటే ప్రమాదం ఉందన్నారు. సోమవారం నిర్వహించిన "రైతు నేస్తం" ప్రత్యేక కార్యక్రమం 110వ ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, రైతు వేదికల నుంచి రైతులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్ పలు సూచనలు చేశారు.
సీఎస్ మాట్లాడుతూ.. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే నెలల్లో ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి, తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. జలాశయాల్లో పూర్తిస్థాయి నిల్వలు లేనందున వానాకాలంలో వరి, పత్తి విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. వానాకాలానికి ముందు నుంచే రైతులను సంసిద్ధులను చేయడంతో పప్పుధాన్యాల విస్తీర్ణం పెరిగిందని వివరించారు. యాసంగిలో పరిస్థితి మరింత తీవ్రమై భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయవద్దని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో వాస్తవ పరిస్థితులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.
వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పంటల సరళి, పప్పుధాన్యాల విస్తీర్ణం పెరుగుదల, వరి విస్తీర్ణం తగ్గుదల వంటి వివరాలను తెలియజేశారు. ఈ యాసంగిలో నూనెగింజలు, పప్పుధాన్యాల పంటలకు సబ్సిడీ అందించి, రైతులను ఆ పంటల వైపు మళ్లిస్తామని చెప్పారు.
నూనె గింజలు, కూరగాయలు పండించండి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితులపై గత ఆరు నెలలుగా ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై రైతులకు సాంకేతిక సలహాలు అందిస్తోందన్నారు. ప్రస్తుత వాతావరణ ప్రభావంతో పంటలకే కాకుండా తాగునీటికి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు తమ పొలాల్లోని భూగర్భ జలాలు, నీటి వసతిని పరిశీలించుకుని, దానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. నీటిని ఆదా చేసే డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మసేద్య పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. నవంబర్‌లో వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున, "రైతు నేస్తం" కార్యక్రమం ద్వారా ప్రతి వారం వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు. రైతులు సరైన నిర్ణయం తీసుకునేలా అన్ని శాఖలు కలిసి కృషి చేయాలని సూచించారు.
నీటిపారుదల శాఖ, భూగర్భ జల శాఖ, విద్యుత్ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోన్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ ఎపిసోడ్‌లో భారత వాతావరణ శాఖ (హైదరాబాద్) శాస్త్రవేత్త-డి డాక్టర్ శ్రావణి ఎల్‌నినో ప్రభావం, వాతావరణ, వర్షపాత పరిస్థితులను వివరించారు. యాసంగికి అనుకూలమైన పంటలపై ఆర్ఏఆర్ఎస్ పాలెం ప్రధాన శాస్త్రవేత్త (నూనెగింజలు) డాక్టర్ డి. శశిభూషణ్, ప్రధాన శాస్త్రవేత్త (పప్పుధాన్యాలు) డాక్టర్ కె. రుక్మిణీ దేవి, సిడాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహదేవప్ప, ఎస్.కె.ఎల్.టి.జి.హెచ్.యు. కూరగాయల శాస్త్రవేత్త డాక్టర్ జె. శ్రీనివాస్ రైతులకు సూచనలు అందించారు. అనంతరం శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖీ, ఎల్‌నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళికపై చర్చ నిర్వహించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం
అక్టోబర్ 12, 2026

Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ
అక్టోబర్ 12, 2026

Revanth Reddy | ఓటిచ్చేందుకు అప్పుడు సర్ తీసుకొస్తే.. ఇప్పుడు బీజేపీ తెంచేస్తుంది
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Nabha Natesh | వైట్ డ్రెస్‌లో నభా నటేష్ హాట్ షో
- ●CM Revanth Reddy | వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం
- ●CEC Gyanesh Kumar Education | యూపీ బోర్డు టాపర్, ఐఐటీ నుంచి హార్వర్డ్ దాకా: వివాదాల కేంద్రంలో ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ విద్యా నేపథ్యం తెలుసా?
- ●Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ - వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్
- ●Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ
- ●Rahul Gandhi vs Election Commission | 'రాహుల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్': సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.. రేపే సీజేఐ బెంచ్ విచారణ

Nabha Natesh | వైట్ డ్రెస్‌లో నభా నటేష్ హాట్ షో

CM Revanth Reddy | వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం

CEC Gyanesh Kumar Education | యూపీ బోర్డు టాపర్, ఐఐటీ నుంచి హార్వర్డ్ దాకా: వివాదాల కేంద్రంలో ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ విద్యా నేపథ్యం తెలుసా?

Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ - వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్





