త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Young man Suicide | బైక్ విష‌యంలో గొడ‌వ‌.. యాద‌గిరిగుట్ట బోర్డు స‌భ్యురాలి మ‌న‌వ‌డి వేధింపుల‌తో గిరిజ‌న‌ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

Young man Suicide | బైక్ విష‌యంలో త‌లెత్తిన వివాదం ఓ యువ‌కుడి ఆత్మ‌హత్య‌కు దారి తీయ‌డం తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి గిరిజ‌న యువ‌కుడిని గ‌త మూడు రోజులుగా వేధించ‌డంతో గ‌త అర్ధ‌రాత్రి ప్రాణాలు తీసుకున్నాడు.

S

Telangana | Published On Sep 19, 2026, 4.13 pm IST

Young man Suicide | బైక్ విష‌యంలో గొడ‌వ‌.. యాద‌గిరిగుట్ట బోర్డు స‌భ్యురాలి మ‌న‌వ‌డి వేధింపుల‌తో గిరిజ‌న‌ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Young man Suicide | త్రినేత్ర‌.న్యూస్‌: బైక్ విష‌యంలో త‌లెత్తిన వివాదం ఓ యువ‌కుడి ఆత్మ‌హత్య‌కు దారి తీయ‌డం తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి గిరిజ‌న యువ‌కుడిని గ‌త మూడు రోజులుగా వేధించ‌డంతో గ‌త అర్ధ‌రాత్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఆమె సాక్షాత్తు యాద‌గిరిగుట్ట బోర్డు స‌భ్యురాలు కావ‌డంతో త‌న మ‌న‌వ‌డిని కాపాడుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

రాజేష్ అనే గిరిజన యువకుడికి, యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనువడు సురేశ్ యాదవ్‌కు బైక్ విషయంలో గొడ‌వ జ‌రిగింది. దీంతో రాజేష్ పై సురేశ్ యాద‌వ్‌ విచక్షణ రహితంగా దాడి చేసి ఇబ్బందులకు గురిచేశాడు. గత 3 రోజులుగా సురేష్ యాదవ్ చేస్తున్న వేధింపులు తాళలేక గ‌త అర్ధరాత్రి రాజేష్ ఆత్మహత్య పాల్ప‌డ్డాడు. రాజేష్ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే ఈశ్వరమ్మ యాదవ్ రంగంలోకి దిగింది.

ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్‌ అండ‌తో వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో మనవళ్లు నానా హంగామా సృష్టించారు. కేసును తప్పుదారి పట్టించేలా మృతుడి తల్లిని బెదిరిస్తున్నారు. తన మనువడి రాజకీయ భవిష్యత్ నాశనం చేయొద్దంటూ రాజేష్ తల్లికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని చెబుతూ బెదిరించారు అని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై గిరిజ‌న, ప్ర‌జా సంఘాల నాయ‌కులు మండిప‌డుతున్నారు. తక్షణమే ఈశ్వరమ్మ యాదవ్, సురేష్ యాదవ్ లపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పోయినోడు తిరిగిరాడంటూ..!

ఏంటి ఈశ్వరమ్మ గారు..! గుర్తుందా.. రెండు మూడు నెలల క్రితం మీకు యాదగిరిగుట్ట బోర్డు పదవి ఇచ్చినందుకు.. ఎల్బీ నగర్‌లో ఫ్లెక్సీలు పెట్టినందుకు.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మీపై నోరు పారేసుకున్నాడు. అభ్యంతరకరమైన భాషతో పెద్దా చిన్నా లేకుండా అహంకార మదంతో నోరు పారేసుకున్నాడు. ఆ సందర్భంలో మీకు పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, ప్రజలందరూ మద్దతుగా నిలిచారు.

రాజకీయంగా వయసులో కూడా మీ సీనియారిటీని గౌరవించాల్సిందే అంటూ జక్కిడి కుటుంబాన్ని గట్టిగా నిలదీశారు. అప్పుడు మీకు క్షమాపణ చెప్పినా కూడా జక్కిడి ఫ్యామిలీని వదల్లేదు. అప్పుడు గొప్పగా మీ రాజకీయ జీవితంపై గర్వంగా చెప్పుకున్న మీరు.. మీ మనవడి విషయంలో ఎందుకు తప్పుడు పద్ధతి అనుసరిస్తున్నారు?

ఎరుకల సామాజిక వర్గానికి చెందిన పేదింటి బిడ్డను మీ మనవడు వేధించి నరకం చూపించడంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఆ విషయం తెలిసి మీరు మీ మనవడిని చట్టపరంగా శిక్షించాలని పోలీసులకు అప్పగించాల్సింది పోయి బాధిత కుటుంబాన్ని సున్నితంగా బెదిరిస్తూ ప్రలోభ పెడుతున్నారు ఎందుకు? పోయినోడు తిరిగిరాడు అంటూ అదేదో మీకు సంబంధం లేదన్నట్లుగా డబ్బుల ఆశ చూపిస్తే సరిపోతుందా? పరిహారం ప‌రిహార‌మే.. నిందితుడికి శిక్ష శిక్ష నే.. అంటూ గిరిజ‌న‌, ప్ర‌జా సంఘాల నాయ‌కులు, పౌరులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement
Advertisement