త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ క‌బ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.క‌ళ్యాణ్‌పై చ‌ర్య‌లు తీసుకోండి

Complaint on Producer C Kalyan | ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతాలో తమ ల్యాండ్ కబ్జా చేసాడని ఆరోపిస్తూ మాదాపూర్ పోలీసులను ఆశ్ర‌యించారు.

S

Telangana | Published On Sep 19, 2026, 3.29 pm IST

Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ క‌బ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.క‌ళ్యాణ్‌పై చ‌ర్య‌లు తీసుకోండి
Advertisement
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ శ్యామ్ సింగ్‌, ప్లాట్ ఓన‌ర్స్‌

Complaint on Producer C Kalyan | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతాలో తమ ల్యాండ్ కబ్జా చేసాడని ఆరోపిస్తూ మాదాపూర్ పోలీసులను ఆశ్ర‌యించారు. త‌మ ప్లాట్స్‌లోకి వెళ్లకుండా అక్రమంగా షీట్స్ వేసి అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సర్వే నెంబర్ 12, 12ఏ, 13 గుట్టల బేగంపేట్‌లో ప్లాట్స్ ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ తెలిపారు. శ‌నివారం ఉదయం సి. కళ్యాణ్ ఇతర వ్యక్తులు తమ ప్లాట్స్‌లోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్స్ వేశారన్నారు. తమ ప్లాట్స్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సి.కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలత అనే వ్యక్తులఫై చర్యలు తీసుకోవాలని ప్లాట్ ఓనర్స్ విజ్ఞ‌ప్తి చేశారు.

గ‌తంలో కేసు న‌మోదు..

ఇదిలా ఉండ‌గా గ‌తంలో సి.క‌ళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. నగరంలోని షేక్‌పేట భూ వివాదంపై సి.కల్యాణ్ తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు. స్వరూప్‌ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement