Pune Man | భార్యకు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్
Pune Man | భార్యకు బిజినెస్ ట్రిప్ అని చెప్పి పూణేకి చెందిన ఓ వ్యాపారి ప్రియురాలితో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే, ఎయిర్‌పోర్టులో ఊహించని షాక్ తగిలింది. ప్రియురాలి పాస్‌పోర్టు వివాదం కారణంగా అతడు తన భార్యకు అడ్డంగా దొరికిపోవాల్సి వచ్చింది.
Pune Man | త్రినేత్ర.న్యూస్ : భార్యకు బిజినెస్ టూర్‌కు వెళ్తున్నానని చెప్పి ప్రియురాలితో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసిన పూణేకి చెందిన ఓ వ్యాపారికి (Pune Man) ఊహించని షాక్ తగిలింది. ప్రియురాలు చేసిన ఓ పొరపాటు కారణంగా అతడు భార్యకు అడ్డంగా దొరికిపోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? పూణేకి చెందిన 45 ఏండ్ల వ్యాపారి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో సరదాగా కొన్ని రోజులు విదేశాలకు విహారయాత్రకు వెళ్లాలనుకున్నాడు. ఇందులో భాగంగానే మలేషియా వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండేందుకు బిజినెస్ పనిమీద బయటకు వెళ్తున్నానని చెప్పి నమ్మించాడు. తన మహిళా స్నేహితురాలితో కలిసి సెప్టెంబర్ 14న ముంబై ఎయిర్‌పోర్టుకు (Mumbai International Airport) చేరుకున్నాడు. మరికాసేపట్లో ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతామని ఇద్దరూ సంబరపడిపోయారు. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది.
సదరు మహిళ తాను గతంలో పోగొట్టుకున్నానని చెప్పిన పాత పాస్‌పోర్టును ఈ ప్రయాణం కోసం ఉపయోగించింది. ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో పాస్‌పోర్టును గుర్తించిన అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ వవ్యహారంపై లీగల్ చర్యలకు ఆదేశించారు. దీంతో తమ గుట్టు ఎక్కడ భార్యకు తెలిసిపోతుందోనని భయపడిపోయిన వ్యాపారి ఇమ్మిగ్రేషన్ (immigration) పేరుతో కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టాడు. ఎయిర్‌పోర్టులోని ఓ ల్యాండ్‌లైన్ ద్వారా తన భార్యకు ఫోన్ చేశాడు. ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్ల తన మొబైల్ ఫోన్‌ను అధికారులకు అప్పగించాల్సి వచ్చిందని కట్టుకథ అల్లాడు. ఆ మరుసటి రోజు వాట్సాప్ వీడియో కాల్ చేసి సమస్య త్వరలోనే ముగుస్తుందని చెప్పి.. ఫోన్ పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసేశాడు. అనంతరం తన ప్రియురాలితో కలిసి ముంబైలోని ఓ హోటల్‌కు వెళ్లిపోయాడు.
భర్త మాటలను నమ్మిన భార్య ఇంటి వద్ద ప్రశాంతంగా ఉంది. రెండు రోజుల తర్వాత కూడా అతడి ఫోన్ కలవకపోవడంతో ఆమె కంగారుపడి పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై కిడ్నాప్ కేసు నమోదైందని తెలుసుకున్న వ్యాపారి.. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విచారణలో జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు. ఎలాంటి కిడ్నాప్ జరగలేదని తేలడంతో పోలీసులు ఈ కేసును పొరపాటున నమోదైన కేసు కింద క్లోజ్ చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ డ్రామాతో వ్యాపారి గుట్టు భార్య ముందు పూర్తిగా రట్టయినట్లైంది.
Also Read..
దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
మా ల్యాండ్ కబ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Air India | ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో భారీ వైఫల్యం.. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు
సెప్టెంబర్ 15, 2026

AIIMS Delhi Population Counter | క్షణక్షణం.. లైవ్‌లో దేశ జనాభా.. రోడ్డుపై డిజిటల్ బోర్డు ఏర్పాటు
సెప్టెంబర్ 7, 2026

Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ.. ‘బై బై నాన్న’ అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!
- ●Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ - సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ
- ●Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
- ●Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ కబ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి
- ●NYC Smart Public Bathrooms | వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా? ఇక ఆ పప్పులు ఉడకవు. 10 నిమిషాలు దాటితే డోర్ ఆటోమేటిక్‌గా ఓపెన్
- ●Tamil Nadu Government | ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం.. నవోదయ పాఠశాలలకు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన తమిళ సర్కార్

Brahmotsavam 2026 | కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!

Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ - సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ

Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు

Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ కబ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి



