Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ – సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ
సమంత నటించాల్సిన ఓ హాలీవుడ్ మూవీ ఛాన్స్‌ను శృతి హాసన్ కొట్టేసింది. సమంత హీరోయిన్‌గా ది అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ పేరుతో ఓ హాలీవుడ్ మూవీ అనౌన్స్ అయ్యింది. బాఫ్టా విన్నర్ ఫిలిప్ జాన్ ఈ సినిమా దర్శకత్వం వహించబోతున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా సమంత ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఆమె ప్లేస్‌లో శృతి హాసన్‌ను మేకర్స్ ఎంపికచేసినట్లు సమాచారం.
Entertainment | Published On Sep 19, 2026, 3.33 pm IST
Shruthi Haasan | చెన్నై బ్యూటీ శృతి హాసన్ ఓ హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమంత చేయాల్సిన పాత్రలో కమల్ తనయ కనిపించబోతుంది. సమంత హీరోయిన్‌గా బాఫ్టా అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ది అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ పేరుతో రెండేళ్ల క్రితం ఈ మూవీని అనౌన్స్ చేశారు. సమంత ఫస్ట్ హాలీవుడ్ మూవీ కావడంతో ప్రకటనతోనే తెలుగు ఆడియెన్స్‌లో ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. సమంత మయోసైటిస్ బారిన పడటం, విడాకుల కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. మా ఇంటి బంగారం తర్వాత ఈ హాలీవుడ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ తాను తల్లి కాబోతున్నట్లు సమంత ప్రకటించడం మరోసారి ఈ హాలీవుడ్ మూవీ షూటింగ్ డైలమాలో పడింది.
సమంత ప్లేస్‌లో...
తాజాగా సమంతను పక్కనపెట్టిన మేకర్స్ ఆమె స్థానంలో శృతి హాసన్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు సమాచారం. హాలీవుడ్ మూవీ కావడం, ఛాలెంజింగ్‌గా దర్శకుడు తన పాత్రను రాసిన తీరు నచ్చడంతో అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌లో భాగం కావడానికి శృతి హాసన్ అంగీకరించినట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో అను డిటెక్టివ్ గా ఈ చెన్నై బ్యూటీ కనిపించబోతుంది.
లేడీ డెటెక్టివ్...
తన సొంత తండ్రిని వెతుక్కుంటూ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు ఓ యువకుడు. పోలీసులు అతడిని ఉగ్రవాదిగా అనుమానిస్తారు. తండ్రికి సంబంధించిన ఆధారాలు మిస్సవుతాయి. అదే టైమ్‌లో అతడికి ఓ లేడీ డిటెక్టివ్ సాయం చేస్తుంది. ఈ జర్నీలో ఆ అమెరికన్ యువకుడితో శృతి హాసన్ ప్రేమలో పడుతుంది? తన తండ్రిని ఆ యువకుడు కలుసుకున్నాడా? లేదా? అనే అంశాలతో ఈ మూవీ రూపొందుతోంది. ది అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ పేరుతో తిమోరి ఎన్ మురారి రాసిన నవల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తమిళంలో ఈ సినిమాను రూపొందిస్తోన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
- ●Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ కబ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి
- ●NYC Smart Public Bathrooms | వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా? ఇక ఆ పప్పులు ఉడకవు. 10 నిమిషాలు దాటితే డోర్ ఆటోమేటిక్‌గా ఓపెన్
- ●Tamil Nadu Government | ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం.. నవోదయ పాఠశాలలకు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన తమిళ సర్కార్
- ●MLC L Ramana | 'చేయూత' పెన్షన్ కోసం జియో ట్యాగింగ్ నిబంధనలు సవరించాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ
- ●Rashmika Mandanna | సుబ్బులక్ష్మి బయోపిక్కు రష్మిక రాంగ్ ఛాయిస్ - ట్రోల్స్‌పై నేషనల్ క్రష్ రియాక్షన్

Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు

Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ కబ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి

NYC Smart Public Bathrooms | వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా? ఇక ఆ పప్పులు ఉడకవు. 10 నిమిషాలు దాటితే డోర్ ఆటోమేటిక్‌గా ఓపెన్

Tamil Nadu Government | ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం.. నవోదయ పాఠశాలలకు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన తమిళ సర్కార్






