MLC L Ramana | ‘చేయూత’ పెన్షన్ కోసం జియో ట్యాగింగ్ నిబంధనలు సవరించాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ
MLC L Ramana | చేనేత కార్మికులందరికీ 'చేయూత' పెన్షన్ పథకం వర్తింపజేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు.
MLC L Ramana | త్రినేత్ర.న్యూస్: చేనేత కార్మికులందరికీ 'చేయూత' పెన్షన్ పథకం వర్తింపజేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు పొందిన చేనేత కార్మికులనే లబ్ధిదారులుగా పరిగణిస్తున్నారని, దీంతో నిజమైన అర్హులైన అనేకమంది కార్మికులు ఈ పథకానికి దూరమవుతున్నారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు.
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 'చేయూత' పెన్షన్ పథకం ప్రయోజనాలు అందేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలి. వలస వెళ్లి వచ్చిన చేనేత కార్మికులకు న్యాయం చేయాలి. ఉపాధి కోసం ముంబై, షోలాపూర్, భివండి, సూరత్, పుణే తదితర ప్రాంతాలకు వలస వెళ్లి, ప్రస్తుతం తిరిగి తెలంగాణకు వచ్చిన చేనేత కార్మికులు జియో ట్యాగింగ్ ప్రక్రియలో నమోదు కాలేకపోయారు. దీనివల్ల వృద్ధాప్యంలో వారికి లభించాల్సిన సామాజిక భద్రత అందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.
చేనేత సహకార సంఘాలలో సభ్యత్వం ఉండి, 50 సంవత్సరాలు పైబడి, జియో ట్యాగ్ లేని కార్మికులను కూడా వారి వృత్తిపరమైన అర్హతలు, సభ్యత్వం, ప్రభుత్వ నిబంధనల ఆధారంగా ఈ పథకంలో పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం జియో ట్యాగింగ్‌నే ప్రామాణికంగా తీసుకోకుండా, చేనేత సహకార సంఘాల రికార్డులు, వృత్తి అనుభవ ధ్రువపత్రాలు, ఇతర ప్రత్యామ్నాయ ఆధారాల ద్వారా అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలి.
అర్హులైన ఏ ఒక్క చేనేత కార్మికుడు కూడా సామాజిక భద్రతా ప్రయోజనాలకు దూరం కాకుండా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, తగిన మార్గదర్శకాలను జారీ చేయాలి. చేనేత వృత్తి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాం అని రమణ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Vemula Prashanth Reddy | కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
సెప్టెంబర్ 19, 2026

Mahesh Kumar Goud | ఖైరతాబాద్ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది : మహేశ్ కుమార్ గౌడ్
సెప్టెంబర్ 19, 2026

Bandi Sanjay | 221 మందికి నియామక ఉత్తర్వులివ్వడం గర్వంగా ఉంది: బండి సంజయ్
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Tamil Nadu Government | ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం.. నవోదయ పాఠశాలలకు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన తమిళ సర్కార్
- ●Rashmika Mandanna | సుబ్బులక్ష్మి బయోపిక్కు రష్మిక రాంగ్ ఛాయిస్ - ట్రోల్స్‌పై నేషనల్ క్రష్ రియాక్షన్
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ ఫోన్లకు భారీ డిమాండ్.. ధర పెరిగినా తగ్గని క్రేజ్..
- ●Vemula Prashanth Reddy | కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
- ●Railway TTE Viral Video | రైలులో టికెట్ అడిగిన టీటీఈ.. బట్టలు చింపుకుని యువతి బ్లాక్మెయిల్ డ్రామా: వీడియో తీయడంతో అడ్డంగా బుక్
- ●Mahesh Kumar Goud | ఖైరతాబాద్ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది : మహేశ్ కుమార్ గౌడ్

Tamil Nadu Government | ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం.. నవోదయ పాఠశాలలకు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన తమిళ సర్కార్

Rashmika Mandanna | సుబ్బులక్ష్మి బయోపిక్కు రష్మిక రాంగ్ ఛాయిస్ - ట్రోల్స్‌పై నేషనల్ క్రష్ రియాక్షన్

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ ఫోన్లకు భారీ డిమాండ్.. ధర పెరిగినా తగ్గని క్రేజ్..

Vemula Prashanth Reddy | కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?



