త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Students Protest | లక్ష డప్పులతో వస్తాం.. ఖబడ్దార్!

కేసీఆర్ ఇంటి ముట్టడిని తీవ్రంగా ఖండించిన ఓయూ విద్యార్థులు.. సీఎం రేవంత్ రెడ్డికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. లక్ష డప్పులతో వస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

J

Hyderabad | Published On Sep 12, 2026, 3.43 pm IST

OU Students Protest | లక్ష డప్పులతో వస్తాం.. ఖబడ్దార్!
Advertisement
  • మాజీ సీఎం కేసీఆర్ ఇంటి ముట్టడిని తీవ్రంగా ఖండించిన ఉస్మానియా యూనివర్సిటీ (OU) విద్యార్థులు
  • దళిత సంఘాల ముసుగులో కాంగ్రెస్ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్వీ, మాదిగ జేఏసీ ఆరోపణ
  • కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే లక్ష డప్పులతో సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్
  • ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన

OU Students Protest | త్రినేత్ర.న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇంటి ముట్టడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దళిత సంఘాల ముసుగులో కాంగ్రెస్ గుండాలే ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (OU) క్యాంపస్ భగ్గుమంది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా బీఆర్ఎస్వీ (BRSV), మాదిగ జేఏసీ (JAC) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి తమ తీవ్ర నిరసనను తెలియజేశారు.

సీఎం రేవంత్‌కు లక్ష డప్పుల వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) టార్గెట్‌గా విద్యార్థి సంఘాల నాయకులు విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఇంటిని ముట్టడించి, బతికున్న వ్యక్తికి చావు డప్పు కొట్టించి సీఎం రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని వారు మండిపడ్డారు. ఇది అత్యంత దారుణమైన చర్య అని, "కేసీఆర్ సార్ ఒక్క పిలుపునిస్తే.. లక్ష డప్పులతో సీఎం రేవంత్ ఇంటి ముందుకు వచ్చి వీరవిహారం చేస్తాం.. సైకో రేవంత్ రెడ్డి ఖబడ్దార్" అంటూ వారు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

OU Students Warn CM Revanth Reddy Over KCR House Siege

ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు

దళితులు, మాదిగల పట్ల కేసీఆర్ ఎప్పుడూ వివక్ష చూపలేదని, వారి అభివృద్ధికి పాటుపడ్డారని విద్యార్థులు స్పష్టం చేశారు. సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎంతో మంది మాదిగ విద్యార్థి నాయకులను గుర్తించి, వారిని ఎమ్మెల్యేలుగా (MLAs), రాష్ట్ర స్థాయి పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాంటి నాయకుడి ఇంటిపై దాడులను ప్రోత్సహించడం సరైంది కాదన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేష్, ఓయూ మాదిగ జేఏసీ చైర్మన్ బుసిపాక గణేష్ మాదిగ పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీలు (State Secretaries) కొండా గణేష్, గంగాధర వెంకట్, నాయకులు అర్జున్, గోపి, సాయి, సాయికిరణ్, రాఘవేంద్ర తదితర విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

Advertisement
Advertisement