CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు
CM Revanth Reddy | ప్రతిపక్ష నేతలు అనాగరిక ఆలోచనలతో, వికృత చేష్టలతో, సభ్య సమాజం తలవంచుకునే విధంగా అసెంబ్లీ ప్రారంభం రోజున వ్యవహరించారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ ఆఫీసు ద్వారా సెక్రటరీ ఇచ్చినా ఆదేశాల మేరకే ప్రతిపక్ష సభ్యులను గేట్ నంబర్ 3 వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆయన స్పష్టం చేశారు.
వారు పెట్టుకున్న నిబంధనలే కదా ఇవి
కొత్తగా మనం చేసిందేమీ లేదు కదా
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రతిపక్ష నేతలు అనాగరిక ఆలోచనలతో, వికృత చేష్టలతో, సభ్య సమాజం తలవంచుకునే విధంగా అసెంబ్లీ ప్రారంభం రోజున వ్యవహరించారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ ఆఫీసు ద్వారా సెక్రటరీ ఇచ్చినా ఆదేశాల మేరకే ప్రతిపక్ష సభ్యులను గేట్ నంబర్ 3 వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి 22ఏ భూములపై వివరణ ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
22ఏ భూముల విషయంలో ప్రభుత్వమే ఉద్దేశపూర్వంగా పేదలను వేధిస్తుంది అన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టు ప్రజా వేదికల్లో మాట్లాడారు. ఈ సమస్య తీవ్రతను బట్టి, ప్రతిపక్షాలు మా బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పి, పేదల మస్యలు పరిష్కరించడం కోసం మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి సభలో 22ఏ భూములపై చర్చ పెట్టాలని నిర్ణయించాం. నిషేధిత భూములు, ప్రభుత్వ భూములు, విద్యాశాఖలో చేపట్టిన చర్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎల్‌నినో కరువు, విద్యుత్ కటకట పరిస్థితులపై మాట్లాడాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.
సభ్య సమాజం తలవంచుకునే విధంగా
గతంలో జరిగిన తప్పిదాలపై చర్చ జరుగుతందని తెలిసినప్పుడు ఈ సభలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అంశాన్ని ప్రస్తావించొద్దు, విద్యార్థులకు అమలు చేస్తున్న పథకాలను, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలు చర్చకు రాకూడదని, కరువు కాటకాల సందర్భంలో రాష్ట్రం కరువు పీడిత ప్రాంతంగా, విద్యుత్ కొరత ఉండాలని క్షుద్ర పూజలు చేసిన అంశాలు చర్చకు వస్తాయనే ఆలోచనతో చర్చ ప్రారంభమం రోజే అనాగరిక ఆలోచనతో, వికృత చేష్టలు, సభ్య సమాజం తలవంచుకునే విధంగా ప్రతిపక్ష నేతలు ప్రవర్తించారు అని సీఎం మండిపడ్డారు.
నిబంధనలు తయారు చేసి ఆమోదించారు
స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత రాజకీయ పార్టీతో ఉన్న సంబంధాలు, అనుబంధాలు ఉండవు. నిష్పక్షపాతంగా హక్కులు కాపాడేందుకు పని చేస్తారు. ఇక హరీశ్‌రావు శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు.. ఈ సభలో ప్లకార్డులు, నినాదాలతో కూడుకున్న ఫ్లెక్సీలు, డ్రెస్సులతో రాకూడదని నిబంధనలు తయారు చేసి ఆమోదించారు. ఇటీవల ఈ నిబంధనలు అమలు చేయాలని స్పీకర్ ద్వారా అసెంబ్లీ సెక్రటరీ పోలీసులకు ఆదేశాలు అమలు చేసే ప్రయత్నం చేశారని సీఎం తెలిపారు.
అయ్యో పాపం అని క్షమించి
పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వెళ్లాడు కదా.. అక్కడ ఎందుకు అడ్డుకోలేదని కొందరు నేతలు అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ మాదిరి.. పార్లమెంట్‌లో కూడా ప్రత్యేక నిబంధనలు రాసుకుని ఉంటే.. రాహుల్ గాంధీని కూడా అనుమతించక పోయేవారు. ఇక్కడ కూడా అలాంటి నిబంధనలు లేకుండా ఉంటే అనుమతించే వారు. పోడియం దాటి వస్తే సస్పెండ్ చేయాలని నిబంధన పెట్టుకున్నారు. మీ మీద దాడి చేయడానికి వచ్చినా కూడా.. అయ్యో పాపం అని క్షమించి, అనుమతించి సభలో మైక్ ఇస్తే జరిగిన పరిణామాల దృష్ట్యా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల మీద దాడి, మహిళలను కించపరిచే విధంగా అర్ధనగ్న ప్రదర్శన, దూషణాలు, చివరకు సభాధ్యక్షుడిని అనరాని మాటలు మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్పి చర్చ చేస్తారేమో అని భావించి మైక్ ఇచ్చారు. మళ్లీ అదే అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంతో వారిని బహిష్కరించారు అని సీఎం వివరణ ఇచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి
- ●Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..
- ●KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా
- ●Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!
- ●Congress MLA Rammohan Reddy | మన గౌరవ ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షా
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి

Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..

KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా

Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!





