Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గ్లామర్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.
Entertainment | Published On Sep 16, 2026, 1.48 pm IST
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గ్లామర్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ తనదైన టేకింగ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ షూట్‌లో హీరోయిన్ నివేతా పేతురాజ్, డింపుల్ హయాతి పాల్గొంటున్నారు. సినిమాలో వీరిద్దరూ గెస్ట్ అప్పియరెన్స్ తరహాలో కాకుండా.. కథలో కీలకంగా ఉండే స్పెషల్ రోల్స్‌లో కనిపించనున్నారని టాక్. తమ పాత్రలకు సంబంధించిన ఇంపార్టెంట్ సీక్వెన్స్‌లతో పాటు ఈ సాంగ్‌లోనూ ఇద్దరూ సందడి చేయనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ 110 రోజులకు పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇంకా కొన్ని కీలకమైన సీన్స్, సాంగ్ షూట్స్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. షూటింగ్ కంప్లీట్ కాకపోయినప్పటికీ.. మేకర్స్ మాత్రం రిలీజ్ విషయంలో క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది. అక్టోబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షూటింగ్ పార్ట్‌ను త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను కంప్లీట్ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇక ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ ఓ మిడిల్ క్లాస్ హస్బెండ్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. సాధారణ కుటుంబ జీవితంలో చోటుచేసుకునే సంఘటనలతో పాటు యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిపి ఈ కథను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండటంతో పాటు.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, కామెడీ టచ్ కూడా సినిమాలో హైలైట్‌గా నిలిచే అవకాశముంది.
మరోవైపు నివేతా పేతురాజ్, డింపుల్ హయాతి స్పెషల్ రోల్స్‌లో కనిపించనుండటంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. వీరిద్దరి పాత్రలు కథలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి? హీరో క్యారెక్టర్‌తో వీరికి ఉన్న కనెక్షన్ ఏమిటి? అనే విషయాలు ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉన్నాయి. సాంగ్ షూట్‌కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్‌ను మేకర్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా వెంకటేశ్-త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్ కావడం, ఫ్యామిలీ డ్రామాకు యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ జోడించడం, నివేతా పేతురాజ్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు స్పెషల్ రోల్స్‌లో కనిపించనుండటంతో ‘ఆదర్శ కుటుంబం’పై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 2 రిలీజ్‌ను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!
- ●Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం
- ●OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..
- ●Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!
- ●Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు
- ●CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి

Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!

Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం

OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..

Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!





