త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta One | మెటా వన్‌.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..

Meta One | మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, మెటా ఏఐ సేవలను కలిపి మెటా వన్‌ పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవను పరిచయం చేసింది. వ్యక్తిగత వినియోగదారులు, కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థల కోసం ప్రత్యేక ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్లాన్స్ దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.

S

Technology | Published On Sep 16, 2026, 2.04 pm IST

Meta One | మెటా వన్‌.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..
Advertisement

Meta One | మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, మెటా ఏఐ సేవలను కలిపి మెటా వన్‌ పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవను పరిచయం చేసింది. వ్యక్తిగత వినియోగదారులు, కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థల కోసం ప్రత్యేక ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్లాన్స్ దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 50కి పైగా ఫీచర్ల‌ను ప్రారంభించగా 1.5 కోట్ల సబ్‌స్క్రిప్షన్లు, ట్రయల్స్ నమోదయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, మెటా ఏఐలో ప్రాథమిక సేవలు ఉచితంగానే కొనసాగుతాయి. అదనపు ఫీచర్లు, విస్తృత ఏఐ వినియోగం కోసం చెల్లింపు ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మెటా వన్‌లో తొలుత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు వ్యక్తిగత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. వీటితోపాటు కోర్, ప్రీమియం పేరుతో ఏఐ సామర్థ్యాలను కూడా కలిపిన బండిల్ ప్లాన్స్‌ను సంస్థ తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్‌లో డైరెక్ట్ మెసేజ్‌లు, స్టోరీస్‌లో కస్టమ్ ఫాంట్లు, నిర్దిష్ట వ్యక్తులు స్టోరీని చూసినప్పుడు నోటిఫికేషన్లు, డీఎం ప్రివ్యూలు వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఫేస్‌బుక్ ప్ల‌స్‌లో..

ఫేస్‌బుక్ ప్లస్‌లో మెసెంజర్ కస్టమైజేషన్ ఆప్షన్లు, రీల్స్‌కు మరిన్ని ఇన్‌సైట్స్, రీల్స్‌, ఫీడ్ పోస్టులకు విస్తరించిన సూపర్ రియాక్షన్స్ అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ ప్లస్‌లో ప్రత్యేక థీమ్స్‌, ఐకాన్స్‌, స్పెషల్ ఎఫెక్ట్ స్టిక్కర్లు, ఎక్కువ చాట్స్‌ను పిన్ చేసే సదుపాయం ఉంటాయి. భవిష్యత్తులో చాట్‌, మీడియా బ్యాకప్‌ల కోసం స్టోరేజ్, నిర్ణీత సమయాల్లో చాట్స్‌ను మ్యూట్ లేదా హైడ్ చేసే ఫోకస్ షెడ్యూల్స్‌ను కూడా పరీక్షించనున్నట్లు మెటా వెల్లడించింది. ఈ వ్యక్తిగత ప్లాన్స్‌కు విశేష రీతిలో ఆదరణ లభిస్తోందని, వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగిస్తున్నారని మెటా తెలిపింది. ఇక కోర్, ప్రీమియం బండిల్ ప్లాన్స్‌లో అధిక కంప్యూటింగ్ వనరులు అవసరమయ్యే ఏఐ ఫీచర్ల వినియోగాన్ని పెంచుకోవచ్చు. మెటా ఏఐ ద్వారా చిత్రాలను రూపొందించడం, ఎడిట్ చేయడం, మ్యూస్ మోడల్స్ ఆధారంగా వీడియోలు క్రియేట్‌ చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టైల్ వంటి ఏఐ టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం ఇందులో ఉన్నాయి.

మెటా ఏఐ ఉచిత‌మే..

అయితే రోజువారీ అవసరాలకు మెటా ఏఐ ఉచితంగానే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రారంభ పరీక్షల్లో బండిల్ ప్లాన్స్ తీసుకున్న సబ్‌స్క్రైబర్లలో సగానికి పైగా ఏఐ, ఎక్స్‌ప్రెషన్ ఫీచర్లను రెండింటినీ ఉపయోగించినట్లు మెటా తెలిపింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టైల్, వాయిస్ ఎఫెక్ట్స్ వంటి ఏఐ ఫీచర్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకునేందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది. క్రియేటర్లు, వ్యాపార సంస్థల కోసం కూడా మెటా వన్‌లో ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పటికే వినియోగిస్తున్న మెటా యాప్‌లలోనే ప్రొఫెషనల్ టూల్స్‌, ఏఐ ఫీచర్లను ఉపయోగించుకునేలా వీటిని రూపొందించారు. ఇందుకోసం కొత్త అకౌంట్‌ సృష్టించడం లేదా ప్రత్యేక యాప్‌ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్స్‌లో వెబ్‌సైట్, లొకేషన్లు, అకౌంట్ గురించి ఇతరులు చెప్పిన వివరాలను ప్రదర్శించే మెరుగైన ప్రొఫైల్ ఉంటుంది. రీల్స్‌లో ప్రత్యేకంగా కనిపించే ఫాలో బటన్‌, కంటెంట్‌తో ఎంగేజ్ అయ్యే వారికి ఆటోమేటిక్‌గా ఫాలో ఇన్విటేషన్లు పంపే సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుంది.

మెటా బిజినెస్‌కు మ‌రింత యాక్సెస్‌..

మెటా బిజినెస్ ఏజెంట్‌కు మరింత విస్తృత యాక్సెస్ కూడా ఇందులో ఉంటుంది. దీని ద్వారా వ్యాపార సంస్థలు వాట్సాప్‌లో కస్టమర్లకు 24 గంటలూ స్పందించే అవకాశం పొందుతాయి. మార్కెటింగ్‌, వ్యాపార కార్యకలాపాలు, కంటెంట్ క్రియేష‌న్‌, ఆప్టిమైజేషన్ వంటి విభాగాల్లో మరిన్ని ఏజెంట్ సామర్థ్యాలను భవిష్యత్తులో జోడించనున్నట్లు మెటా వెల్లడించింది. క్రియేటర్‌, బిజినెస్ ప్లాన్స్‌లో ఎసెన్షియల్‌, అడ్వాన్స్‌డ్‌, ఎక్స్‌పర్ట్‌, మ్యాక్స్ అనే స్థాయిలు ఉన్నాయి. ఎసెన్షియల్ ప్లాన్‌లో ప్రొఫైల్ మేనేజ్‌మెంట్ టూల్స్‌, వాట్సాప్‌లో మెటా బిజినెస్ ఏజెంట్‌కు ఎక్కువ యాక్సెస్‌, వెరిఫైడ్ బ్యాడ్జ్‌, వాట్సాప్ బిజినెస్ యాప్‌లో వెరిఫైడ్ ఛానల్‌, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉంటాయి. అయితే వెరిఫికేషన్ విజయవంతం కావడం దీనికి వర్తిస్తుంది.

అడ్వాన్స్‌డ్ ప్లాన్‌లో..

అడ్వాన్స్‌డ్ ప్లాన్‌లో 30 రోజుల ముందుగానే స్టోరీలను షెడ్యూల్ చేసే అవకాశం, ఆర్గానిక్ పోస్టులు, రీల్స్‌లో లింకులు, ఎక్స్‌పోర్ట్ చేసుకునే అనలిటిక్స్‌, లోతైన ఆడియన్స్ ఇన్‌సైట్స్‌, పాస్‌వర్డ్ షేర్ చేయకుండా టీమ్ సభ్యులకు యాక్సెస్‌, మరిన్ని లింక్డ్ డివైజ్‌లు, వాట్సాప్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ క్రెడిట్స్‌, అదనపు మెటా బిజినెస్ ఏజెంట్ స్పందనలు లభిస్తాయి. ఎక్స్‌పర్ట్‌, మ్యాక్స్ ప్లాన్స్‌లో పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే టీమ్‌లకు అత్యధిక ఫీచర్లు, మెటా బిజినెస్ ఏజెంట్ సామర్థ్యం అందుతుంది. మెటా వన్‌లో ఎడిట్స్ ప్లస్‌ను కూడా తీసుకురానుంది. దీని ద్వారా పలు డివైజ్‌ల మధ్య ప్రాజెక్టులను సింక్ చేసి యాక్సెస్ చేసుకునేందుకు అదనపు క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. రానున్న ఎడిట్స్ అసిస్టెంట్‌ను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏఐ అసిస్టెంట్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌సైట్స్‌ను విశ్లేషించి కొత్త కంటెంట్ ఆలోచనలను రూపొందించడంలో సహాయపడుతుంది.

రుసుము ఎంత‌..

మెటా వన్ ప్లాన్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ప్లాన్స్‌, ఫీచర్లు, ధరలు, అందుబాటు ప్రాంతాన్ని బట్టి, యాప్‌, అకౌంట్‌ను బట్టి మారుతాయి. తమ అకౌంట్‌కు అందుబాటులో ఉన్న ఫీచర్లను తెలుసుకునేందుకు వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ ధర నెలకు రూ.99గా ఉంది. వాట్సాప్ ప్లస్ నెలకు రూ.79, ఫేస్‌బుక్ ప్లస్ ను నెలకు రూ.99గా నిర్ణయించారు. ఏఐతో కూడిన బండిల్ ప్లాన్స్‌లో కోర్ నెలకు రూ.549, ప్రీమియం నెలకు రూ.1,950గా ఉన్నాయి. క్రియేటర్‌, బిజినెస్ బండిల్ ప్లాన్స్‌లో ఎసెన్షియల్ ధర నెలకు రూ.639 నుంచి ప్రారంభమవుతుంది. అడ్వాన్స్‌డ్ ప్లాన్ రూ.2,099 నుంచి, ఎక్స్‌పర్ట్ ప్లాన్ రూ.6,399 నుంచి, మ్యాక్స్ ప్లాన్ రూ.20,990 నుంచి ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో ఎడిట్స్‌, ఏఐ గ్లాసెస్ సహా మరిన్ని ఉత్పత్తులు, అనుభవాలకు మెటా వన్ సేవలను విస్తరించనున్నట్లు మెటా తెలిపింది.

Advertisement
Advertisement