త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jakkani Anitha | ప‌ర‌కాలను నీకెవ‌ర‌న్నా రాసిచ్చిర్రా? మ‌ళ్ల మాట్లాడ్తే మూతి ప‌గుల్త‌ది

Jakkani Anitha | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా సుష్మిత‌ పిచ్చి వాగుడు వాగుతోంద‌ని.. మ‌ళ్లోసారి రేవంత్‌, ఆయ‌న అన్న‌ద‌మ్ముల‌పై మాట్లాడితే మూతి ప‌గుల్త‌ద‌ని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ జక్కని అనిత హెచ్చరించారు.

S

Telangana | Published On Aug 19, 2026, 7.48 pm IST

Jakkani Anitha | ప‌ర‌కాలను నీకెవ‌ర‌న్నా రాసిచ్చిర్రా? మ‌ళ్ల మాట్లాడ్తే మూతి ప‌గుల్త‌ది
Advertisement
  • ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్కోపో.. ఎవ‌రొద్ద‌న్న‌రు
  • పెద్ద మనిషిని ప‌ట్టుకొని నోటికొచ్చిన‌ట్టు మాట్ల‌డుతున్న‌వ్.. సిగ్గుందా?
  • పిల్ల‌కాకి, పిచ్చి మాట‌లు ఆపు ఇగ‌
  • కాంగ్రెస్ పార్టీ, రేవంత్ గురించి మాట్లాడ్డానికి నువ్వెవరు?
  • కాంగ్రెస్‌ల‌నే పుట్టి, కాంగ్రెస్‌ల‌నే స‌చ్చిపోయిన‌ట్టు తెగ బిల్డ‌ప్ ఇస్తున్న‌వ్‌
  • అస‌లు నీకు పార్టీలో స‌భ్య‌త్వం ఉందా?
  • మ‌ళ్లొసారి మాట్లాడితే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వెంట‌ప‌డి కొడ్త‌రు
  • కొండా సుష్మిత‌పై హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ జక్కని అనిత ధ్వ‌జం

Jakkani Anitha | త్రినేత్ర‌.న్యూస్: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా సుష్మిత‌ పిచ్చి వాగుడు వాగుతోంద‌ని.. మ‌ళ్లోసారి రేవంత్‌, ఆయ‌న అన్న‌ద‌మ్ముల‌పై మాట్లాడితే మూతి ప‌గుల్త‌ద‌ని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ జక్కని అనిత హెచ్చరించారు. రేవూరి లాంటి పెద్ద‌మ‌నిషిని ప‌ట్టుకొని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ్డానికి సిగ్గుండాల‌న్నారు. పరకాల నీకు ఎవరైనా రాసి ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసుకుంటే ఎవ‌రొద్దంటున్నార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ గురించి మాట్లాడ్డానికి నువ్వెవర‌ని నిల‌దీశారు. పిల్ల‌కాకి, పిచ్చి మాట‌లు ఆప‌కుంటే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వెంట‌ప‌డి కొడ‌తార‌న్నారు. బుధ‌వారం సీఎం రేవంత్‌పై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

పొగరు పట్టి కొట్టుకుంటున్నవ్‌..

పరకాలలో కొండా సుస్మిత నోటికొచ్చినట్లు మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పిచ్చి వాగుడు వాగుతోంది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటానికి ఆమె ఎవరు? ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ఉన్న పదవి ఏమిటి? కాంగ్రెస్ నాయకురాలినని ఆమెకు ఆమె చెప్పుకుని తిరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ల గురించి చెప్పడానికి నీకున్న అర్హత ఏమిటి? పొగరు పట్టి కొట్టుకుంటున్నావు. కళ్లు నెత్తికెక్కి వాగుతున్నావు.

అహంకారానికి హద్దు, అదుపు లేకుండా పోయింది. మా ముఖ్యమంత్రిని విమర్శించడానికి నీకెంత ధైర్యం? పరకాలలో పోటీ చేస్తానని నువ్వెలా చెబుతున్నావు? నీకు ఉన్న అర్హత ఏమిటి? కాంగ్రెస్ టికెట్లు ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని అంటున్నావు. మరి పరకాల టికెట్ నాదే అని చెప్పడానికి నువ్వు ఎవరు? నువ్వు అధిష్ఠానమా? టికెట్ నాదే అని చెప్పడానికి? ముఖ్యమంత్రి గురించి, ఆయన అన్నదమ్ముల గురించి మాట్లాడితే మూతి పగులుతుంది.

గతంలో కూడా నోటికొచ్చినట్లు వాగావు. కానీ మేం చాలా ఓపికతో వ్యవహరించాం. నీలాంటి వాళ్ల గురించి మాట్లాడాల్సి రావడం మా దురదృష్టం. పిచ్చి వాగుడు వాగితే కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారు. జాగ్రత్త! రేవూరి ప్రకాశ్ రెడ్డి పెద్ద మనిషి. చాలా హుందాగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయనను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. సిగ్గుందా?

మా రాహుల్‌, సొనియా ఫొటోలు ఎందుకు పెట్టుకున్న‌వ్‌?

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మాట్లాడుతున్నావు. పోటీ చేసుకో. ఎవరొద్దన్నారు? కానీ మా కాంగ్రెస్ పార్టీ జెండాలు, మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫొటోలు ఎందుకు పెట్టుకున్నావు? నీకు ఇష్టమైన పార్టీ నుంచి పోటీ చేసుకోవచ్చు. నిన్ను ఎవరూ బతిమాలలేదు కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోటుకు వెళ్లి టికెట్ నాదే, నేనే పోటీ చేస్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పరకాల నీకు ఎవరైనా రాసి ఇచ్చారా?

గ‌తంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న‌వ్‌..

పిల్లకాకి మాటలు ఆపు. పిచ్చి మాటలు ఆపు. ముఖ్యమంత్రి గురించి మరోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటపడి కొడతారు. జాగ్రత్త! అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? బీఆర్‌ఎస్ పార్టీలో లేవా? కాంగ్రెస్‌లోనే పుట్టి, కాంగ్రెస్‌లోనే చచ్చిపోయినట్లు తెగ బిల్డప్ ఇస్తున్నావు.

నీకంత సీన్ లేదు..

నువ్వు ఏదో పెద్ద నాయకురాలిని అని అనుకుంటున్నావు. నీకంత సీన్ లేదు. కుటుంబం పేరు చెప్పుకుని రాజకీయాలు చేసేది నువ్వు. ఏ రాజకీయ నేపథ్యం లేకుండా ముఖ్యమంత్రి అయిన చరిత్ర మా రేవంత్ రెడ్డిది.
కుట్ర రాజకీయాలు ఆపు. నీ చరిత్ర అంతా తవ్వి తీస్తాం. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో అని అనిత హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement