Kondagattu | కొండగట్టులో కూలిన చలువ పందిళ్లు.. భక్తుల ఆగ్రహం
Kondagattu | హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) ఉత్సవాల వేళ కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయంలో అపశృతి చోటుచేసుకున్నది. ఆలయంలో ఏర్పాటు చేసిన చలువ పందికి కూలిపోయింది. దీంతో 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Kondagattu | త్రినేత్ర.న్యూస్: హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) ఉత్సవాల వేళ కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయంలో అపశృతి చోటుచేసుకున్నది. ఆలయంలో ఏర్పాటు చేసిన చలువ పందికి కూలిపోయింది. దీంతో 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యార్ధం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తోపులాట చోటుచేసుకున్నది. ఈక్రమంలో కేశఖండనం నిర్వహిస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలవ పందిరి కూలిపోయింది. దీంతో అక్కడున్న 15 మంది భక్తులపై అడిపోయాయి. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. తోటి భక్తులు వారిని దవాఖానకు తరలించారు.
కాగా, నాసిరకం పనుల వల్లే ఘటన చోటుచేసుకున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గాలేదని తెలిపారు. ఈ ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండగట్టు ఆలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. నిత్యం వేలాది మంది, ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర స్థలంలో కనీస మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటమే ఘటనకు కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షణ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొండగట్టు అంజన్న ఆలయంలో అపశృతి
చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు
నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం pic.twitter.com/rEqftgHPdV
— Telugu Feed (@Telugufeedsite) April 1, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?






