Kondagattu | సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?.. కొండగట్టు హుండీలో లేఖ
Kondagattu | సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?.. ఇది సామాన్య భక్తుడి ఆక్రోశం. ఓ ఆలయం హుండీలో డబ్బులకు బదులు లేఖ (Protest Letters) లభించింది. అందులో ఓ భక్తుడు అధికారులను వేసిన ప్రశ్న ఇది.
Kondagattu | త్రినేత్ర.న్యూస్: సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?.. ఇది సామాన్య భక్తుడి ఆక్రోశం. ఓ ఆలయం హుండీలో డబ్బులకు బదులు లేఖ (Protest Letters) లభించింది. అందులో ఓ భక్తుడు అధికారులను వేసిన ప్రశ్న ఇది.
రాష్ట్రంలోని హనుమాన్ ఆలయం కొండగట్టులో (Kondagattu) ఆంజనేయస్వామి చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 16 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు పెద్దఎత్తున భక్తులు, మాలధారులు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్యా ఆలయ ప్రాంగణంలో అధికారులు 14 హుండీలను ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా నగదుతో పాటు ఏర్పాట్లపై అసంతృప్తితో భక్తులు రాసిన లేఖలు పదుల సంఖ్యలో బయటపడ్డాయి.
వేలాది మంది వచ్చే చోట కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదని, ఆలయ ప్రాంగణం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, కనీస వసతులు లేని వాష్ రూమ్స్ వల్ల మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తున్నదని, అక్కడ కూడా కనీస వసతులు ఏర్పాటు చేయలేదని లేఖల్లో మండిపడ్డారు. ఆలయానికి వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదు? అని అధికారులను నిలదీశారు. ముందు వసతులు మెరుగుపరచండి.. ఆ తర్వాతే హుండీలో కానుకలు వేస్తాం! అంటూ మండిపడ్డారు. దీంతో అధికారులు ఖంగుతున్నారు. కొండగట్టులో వసతులపై ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా మేల్కొనకపోతే భక్తుల ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Tirumala | మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 లక్షల మందికిపైగా భక్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?
జూన్ 5, 2026

Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
జూన్ 4, 2026

Char Dham Yatra | చార్ ధామ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. ఇప్పటి వరకూ 12.62 లక్షల మంది పూజలు
మే 15, 2026
తాజావార్తలు
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..

TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?



