Vinod Kumar | భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్ చెప్పమన్నడా?
Vinod Kumar | కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని.. భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి చెప్పమన్నారా? అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మంత్రులకు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మంత్రులకు ఏబీసీడీలు కూడా తెలియవ్
- ఇసుక దందా కోసమే నీళ్లు నింపుతలేరు
- ఉత్తమ్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయా
- మీడియా సమావేశంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్
త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని.. భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి చెప్పమన్నారా? అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మంత్రులకు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు. పైలట్ ఉత్తమ్ దురదృష్టవశాత్తు గ్రౌండ్‌లో ఉన్నారని ఎద్దేశా చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రులకు చురకలంటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద వందల లారీలు పెట్టి ఇసుక తవ్వుతున్నారని.. అందుకోసమే ఆనకట్టల్లో నీరు నింపడం లేదని ఆరోపించారు. ఉత్తమ్ ఎన్డీఎస్ఏతో ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
రేవంత్ ప్రభుత్వం 95 శాతం వాడుతోంది..
భద్రాచలం కొట్టుకుపోతుందని ఉత్తమ్ అంటున్నారు. 2021లో భారీ వరదలతో 29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 250 టీఎంసీల నీరు వెళ్లినా భద్రాచలంకు ఏం కాలేదు. అసలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అన్నారం, సుందిళ్ల పూర్తిగా కాకుండా కొంతమేర నింపి నీటిని ఎత్తిపోయండి. అన్నారం, సుందిళ్లకు ఇబ్బంది లేదని నివేదికలు చెప్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం 95 శాతం ఉపయోగిస్తోంది అని మాజీ ఎంపీ పేర్కొన్నారు.
ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేసి నింపింది కేసీఆర్ ప్రభుత్వం అనే విషయాన్ని మరచిపోవద్దు. కాళేశ్వరం ఉపయోగించుకోకుండా లక్షల టన్నుల వరిధాన్యం పండిందని ఉత్తమ్ ఇంకోమారు చెప్పవద్దు. ఎల్‌నినో వచ్చింది.. నీరు నింపుతామని మంత్రి ఉత్తమ్ ఒక్కసారైయినా ఎన్డీఎస్ఏతో మాట్లాడారా? 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్కరోజైనా దీని గురించి ఆలోచించారా? ఇప్పటికైనా ఇసుక లారీలు బంద్ చేయండి. కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి తరలించాలి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలి. సీఎంతో మాట్లాడి నీటిని ఎత్తిపోసేలా చూడాలి అని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
ఈ మీడియా సమావేశంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ధర్మేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
- ●Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?





