Bhatti Vikramarka | జెన్‌కో, ట్రాన్స్‌కోను ప్రయివేటీకరించం : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | రాష్ట్రంలో పీక్ డిమాండ్ 19,892 మెగావాట్స్‌కు పెరిగిందని, అయినా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక జెన్‌కో, ట్రాన్స్‌కోను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారం సరికాదు
విద్యుత్ సరఫరాపై బురద రాజకీయాలు వద్దు
ఎల్‌నినో ఎఫెక్ట్ ఉన్నప్పటికీ.. విద్యుత్ కోతల్లేవు
యాదాద్రి పవర్ ప్లాంట్ పాపం ఎవరిది
నిలదీసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో పీక్ డిమాండ్ 19,892 మెగావాట్స్‌కు పెరిగిందని, అయినా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక జెన్‌కో, ట్రాన్స్‌కోను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు. ప్రజా భవన్‌లో విద్యుత్ అధికారులతో కలిసి భట్టి విక్రమార్క బుధవారం మీడియాతో మాట్లాడారు.
కర్ణాటక పెద్ద రాష్ట్రం, వాళ్ళ డిమాండ్ 20 వేల మెగావాట్ల.. కానీ మన రాష్ట్రంలో విద్యుత్ పీక్‌కి డిమాండ్ పెరిగింది. అయినా.. ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో విద్యుత్ అందిస్తున్న సిబ్బందిని అభినందించాల్సింది పోయి.. కొందరు నాయకులు తప్పుడు మాటలు చెప్పి తప్పుడు తోవ పట్టిస్తున్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్‌ను నమ్మే పార్టీ. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా.. పదేళ్లు మంత్రిగా చేసిన మీరు రాష్ట్రానికి నష్టం చేకూరేలా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు.. మీకు మీరే ప్రైవేటేజేషన్ చేస్తున్నారని చెప్పడం సరికాదు. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి ఏదో మాట్లాడారు. యాదాద్రి పవర్ ప్లాంట్ డీపీఆర్ ఉందా..? కనీసం కోల్ లింకేజ్ ప్లాన్ చేశారా? నది లేకుండా.. హైడల్ పవర్ కడితే ఎలా ఉంటుందో.. కోల్ లేకుండా థర్మల్ పవర్ పెడితే అంతే. కోల్ లేకుండా యాదాద్రి థర్మల్ పవర్ ఎలా కట్టారు. స్టార్టింగ్ నుంచి కోల్ లేకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కట్టి.. రాష్ట్రం మీద భారం వేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
కిందా మీద పడి కోల్ సప్లై చేస్తున్నాం
సింగరేణిలో లేకుంటే.. కేంద్రం కోల్ బ్లాక్స్ నుంచి తెద్దాం అని ప్రయత్నం అయినా చేశారా? సింగరేణికి ఆదేశాలు అయినా ఇచ్చారా? కోల్ బ్లాక్‌లోకి ఆక్షన్ లేకుండా ఆపేసింది మీరు. ఉన్న కోల్ బ్లాక్స్‌లో14 మూత పడ్డాయి. యాక్షన్‌లోకి వెళ్తే కొన్ని బ్లాకులు అయినా వచ్చేవి. మీరు అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. సింగరేణి కోల్ తగ్గింది అంటున్నారు. 2025 లో 62.07 మెట్రిక్ టన్నులు అమ్మింది సింగరేణి. 14 బ్లాకులు క్లోజ్ అయినా.. 62 మెట్రిక్ టన్నులు తీశాం అంటే తక్కువా..? ఎక్కువా..? విశాఖపట్నం, కృష్ణపట్నం నుంచి కోల్ ఇవ్వండి అని 2016లో రైల్వేకి లేఖ రాశారు. ఇదైనా చేశారా అంటే అదీ లేదు. మీరు మొదలు పెట్టారు కానీ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారా..? 50 శాతం ఇప్పుడు కోల్ వాడతాం అని.. మిగిలినది ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పారు. తర్వాత 100 శాతం సింగరేణి నుంచి తీసుకు వచ్చే ప్లాన్ చేస్తుంది అని కోర్టులో కేసు వేశారు. దాన్ని మీరు హ్యాండిల్ చేశారా? మేం అధికారంలోకి వచ్చాక పబ్లిక్ హియరింగ్ పెట్టాం. 2017 వరకే ప్లాంట్ ఇస్తాం అన్నారు. 2023 వచ్చినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు క్లియర్ చేయించి ప్లాంట్ పూర్తి చేశాం. కిందా మీద పడి కోల్ సప్లై చేస్తున్నాం. 2025లో 2 యూనిట్‌లు, 2026లో రెండు యూనిట్లు మొదలు పెట్టాం. చేసే తప్పులు చేసి.. తగుదునమ్మా అని మాట్లాడుతున్నారు అని విమర్శించారు.
89.6 మిలియన్ యూనిట్లు ప్రొడక్షన్ చేశాం
హరీష్ మాటలు చూస్తుంటే నవ్వాలా..? ఏడవాలో అర్థం కావడం లేదు. వారానికి ఒకటి మీ తప్పులు ఆధారాలతో సహా బయట పెడతా. యాదాద్రి పవర్ ప్లాంట్‌కి వేరే వాళ్ళకు ఇచ్చిన బొగ్గు వాడుకుంటున్నాం. నైనీ బ్లాక్ కనీసం పట్టించుకోలేదు మీరు. నేను వెళ్ళి ఒప్పించి.. మైనింగ్ మొదలు పెట్టాం. అక్కడి నుంచి యాదాద్రికి కోల్ ఇస్తున్నాం. జయపూర్ ప్లాంట్‌కి.. అలాట్ చేసిన వాళ్ళకు మాత్రమే నైని నుంచి ఇవ్వగలం. కేంద్రానికి లేఖలు రాసి కోల్ అలాట్ చేసుకుంటున్నాం. మీరు చేసిన తప్పులు సరిదిద్దుతూ పవర్ ప్లాంట్ నడిపిస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి తక్కువ ధరకు విద్యుత్ వస్తుందా అంటే అది కూడా లేదు. యూనిట్‌కి రూ.6.60 పైసలు పడుతుంది. కాకతీయ నుంచి రూ.4.97 పడుతుంది. కొత్తగూడ నుంచి రూ.4.62 కి పడుతుంది. ఎవరి మీద పడుతుంది ఈ భారం. మీరు ఏ రకంగా మేలు చేసినట్టు..? యాదాద్రి ప్లాంట్ లైఫ్ టైమ్ 25 ఏళ్లు. రూ. 40 వేల కోట్లు రాష్ట్రం మీద భారం వేశారు మీరు. గ్రిడ్ వచ్చాక.. పవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా పవర్ సప్లై చేయొచ్చు. అది వదిలేసి.. ఇలాంటి ప్లాంట్స్ పెట్టి నష్టం చేసింది మీరు. బ్లాకులో ఏం బొగ్గు దొరికితే అది ఇస్తారు. కానీ జీ9 నుంచి తేవాలి అంటున్నారు. బొగ్గు అందుబాటులో తెచ్చుకోవాల్సిన బాధ్యత అప్పుడు ఎందుకు మర్చిపోయారు. అది దొరక్కపోతే.. ఇంకో బ్లాక్ నుంచి తెస్తున్నాం. మాకు ప్లానింగ్ ఉంది కాబట్టే సింగరేణిలో ప్లాంట్ పెట్టాం. మేం పెట్టే యూనిట్.. మీరు పెట్టిన యాదాద్రి కంటే తక్కువ ధరకు విద్యుత్ వస్తుంది. అది మా ప్లాన్. థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు అంటున్నారు. 89.6 మిలియన్ యూనిట్లు ప్రొడక్షన్ చేశాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
తాజావార్తలు
- ●Lenovo ThinkBook 14x | లెనోవో నుంచి 990 గ్రాముల థింక్‌బుక్.. ధర ఎంతంటే?
- ●Prabhas | ప్రభాస్ సినిమాల రిలీజ్ ఆర్డర్ మారింది.. ముందు వచ్చేది స్పిరిట్ మూవీయే..!
- ●US Bond Yield | అమెరికా బాండ్లపై అమ్మకాల ఒత్తిడి.. 24 ఏళ్ల గరిష్ఠానికి 30 ఏళ్ల బాండ్ ఈల్డ్..
- ●Form 7 Voter Deletion Fraud | ఓటర్ల జాబితా నుంచి పేర్ల గల్లంతు కుట్ర: బీజేపీ ఏజెంట్‌పై ఎఫ్ఐఆర్
- ●Double Engine Disaster | "డబుల్ డిజాస్టర్".. 5 నెలల్లో 2,454 అత్యాచారాలు, 600 హత్యలు
- ●Harish Rao | రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని వెనక్కి తీసుకోవాలి

Lenovo ThinkBook 14x | లెనోవో నుంచి 990 గ్రాముల థింక్‌బుక్.. ధర ఎంతంటే?

Prabhas | ప్రభాస్ సినిమాల రిలీజ్ ఆర్డర్ మారింది.. ముందు వచ్చేది స్పిరిట్ మూవీయే..!

US Bond Yield | అమెరికా బాండ్లపై అమ్మకాల ఒత్తిడి.. 24 ఏళ్ల గరిష్ఠానికి 30 ఏళ్ల బాండ్ ఈల్డ్..

Form 7 Voter Deletion Fraud | ఓటర్ల జాబితా నుంచి పేర్ల గల్లంతు కుట్ర: బీజేపీ ఏజెంట్‌పై ఎఫ్ఐఆర్






