త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | రైత‌న్న‌లూ! మా మాట వినండి.. యాసంగి పంట వ‌ద్దు 

Ponguleti Srinivas Reddy | ఎల్‌నినో (El Nino) ప్రభావం వ‌ల్ల ఉన్న పంట‌ల‌నే కాపాడ్డానికి ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని.. ప్ర‌భుత్వం మాట విని యాసంగి పంట వేయొద్ద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి రైతుల‌ను కోరారు.

S

Telangana | Published On Oct 11, 2026, 7.22 pm IST

Ponguleti Srinivas Reddy | రైత‌న్న‌లూ! మా మాట వినండి.. యాసంగి పంట వ‌ద్దు 
Advertisement
  • నీళ్లు లేవ్‌.. ఎల్‌నినో ప్ర‌భావం ఎక్కువుంది
  • ఉన్న పంట‌ను కాపాడ్డానికే ఇబ్బంద‌వుతుంది
  • పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్‌: ఎల్‌నినో (El Nino) ప్రభావం వ‌ల్ల ఉన్న పంట‌ల‌నే కాపాడ్డానికి ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని.. ప్ర‌భుత్వం మాట విని యాసంగి పంట వేయొద్ద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి రైతుల‌ను కోరారు. రాష్ట్రంలో తీవ్ర జల వనరుల సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయ‌ని చెప్పారు. రాష్ట్రానికి అధిక ఆర్థిక సహాయం అందించేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వీబీజీ రామ్ జీ (V-BG Ram G) పథకం కింద గ్రామాల్లో అదనపు పనిదినాలు కల్పించాలని కేంద్రాన్ని కోర‌తామ‌న్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు.

ఇప్పటికే రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పంట వేసి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. రెండో పంట వేసి, నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని, ప్రభుత్వ సూచనలను పాటించాలి.

ఎల్‌నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ బృందం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తాం. రాష్ట్రానికి అధిక ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తాం అని పొంగులేటి పేర్కొన్నారు.

Advertisement
Advertisement