Stock Markets | మళ్లీ మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు..
Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు మొదలవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు ఇప్పటికే ర్యాలీలో ఉండగా గత సెషన్ ముగింపులో పెట్టుబడిదారులు సుదీర్ఘ వారాంతం కారణంగా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు.
Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు మొదలవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు ఇప్పటికే ర్యాలీలో ఉండగా గత సెషన్ ముగింపులో పెట్టుబడిదారులు సుదీర్ఘ వారాంతం కారణంగా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో సూచీల్లో కాస్త కరెక్షన్ వచ్చింది. అయితే మధ్య ప్రాచ్యంలో మళ్లీ దాడులు ప్రారంభమైన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. సోమవారం సెషన్‌లో సూచీలు స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుందా, శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటారా అనే విషయంపై పెట్టుబడిదారుల్లో సందిగ్ధత నెలకొంది. నిఫ్టీ 50 సూచీ 40 పాయింట్లు తగ్గి 24,000 వద్ద ట్రేడవుతుండగా, సెన్సెక్స్ 240 పాయింట్లు పడిపోయి 76,850 వద్ద కొనసాగుతోంది.
పెరిగిన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ యుద్ధ ఉద్రిక్తతలు మొదలవ్వడంతో మళ్లీ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే ఆందోళన నెలకొంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.21 శాతం పెరిగి బ్యారెల్‌కు 73 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.26 శాతం పెరిగి బ్యారెల్‌కు 69 డాలర్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ కాస్త బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.06 శాతం పెరిగి 94.33 వద్ద ఉంది.
సంబంధిత వార్తలు

NPS | దీర్ఘకాలంలో ఎన్పీఎస్ బెస్ట్.. రికవర్ అవుతున్న మార్కెట్లు.. ఇదే సరైన సమయమా..?
జూన్ 27, 2026

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..
జూన్ 26, 2026

Stock Markets | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు..
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●Credit Score | ఆదాయం ఎక్కువగా ఉన్నా క్రెడిట్ స్కోరు పెరగడం లేదా.. కారణాలు ఇవే..!
- ●Ram Mandir Donations Row | ఆకాశమేమీ విరిగిపడదు.. రామమందిర విరాళాల కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- ●Shamshabad Airport | శంషాబాద్‌లో ల్యాండ్ అవుతున్న విమానానికి లేజర్ లైట్స్.. పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
- ●Apple Products | భారత గ్రే మార్కెట్లలోకి యాపిల్ ఉత్పత్తులు.. ధరల పెంపు ఎఫెక్ట్..?
- ●Fire | పేలిన ఏసీ యూనిట్.. రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం
- ●Sreeleela | యూట్యూబ్‌లో చరిత్రను సృష్టించిన మహేష్‌బాబు ,శ్రీలీల తెలుగు సాంగ్ - 800 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్

Credit Score | ఆదాయం ఎక్కువగా ఉన్నా క్రెడిట్ స్కోరు పెరగడం లేదా.. కారణాలు ఇవే..!

Ram Mandir Donations Row | ఆకాశమేమీ విరిగిపడదు.. రామమందిర విరాళాల కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

Shamshabad Airport | శంషాబాద్‌లో ల్యాండ్ అవుతున్న విమానానికి లేజర్ లైట్స్.. పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Apple Products | భారత గ్రే మార్కెట్లలోకి యాపిల్ ఉత్పత్తులు.. ధరల పెంపు ఎఫెక్ట్..?



