త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus | వ‌న‌ప‌ర్తిలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. 30 మందికి గాయాలు

RTC Bus | వ‌న‌పర్తి జిల్లా పెబ్బేరు వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సులో (RTC Bus ) బోల్తా ప‌డింది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బ‌స్సు మంత్రాల‌యం (Mantralayam) నుంచి వ‌న‌ప‌ర్తి (Wanaparthy)వ‌స్తున్న‌ది.

G

Telangana | Published On Jun 29, 2026, 10.41 am IST

RTC Bus | వ‌న‌ప‌ర్తిలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. 30 మందికి గాయాలు
Advertisement

RTC Bus | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌న‌పర్తి జిల్లా పెబ్బేరు వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సులో (RTC Bus ) బోల్తా ప‌డింది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బ‌స్సు మంత్రాల‌యం (Mantralayam) నుంచి వ‌న‌ప‌ర్తి (Wanaparthy)వ‌స్తున్న‌ది. ఈ క్ర‌మంలో పెబ్బేరు (Pebber) వ‌ద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై అదుపుత‌ప్పి బోల్తా (Overturned) ప‌డింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గ‌మ‌నించిన వాహ‌న‌దారులు, స్థానికులు వెంటనే స్పందించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను పెబ్బేరు ప్రభుత్వ ద‌వాఖాన‌కు తరలించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ఆరాతీశారు. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహ‌నాన్ని త‌ప్పించే క్ర‌మంలో బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తాప‌డిన‌ట్లు తెలిపారు. ప్ర‌మాదంతో ఆ మార్గంలో కొద్దిసేపు వాహ‌నాలు నిలిచిపోయాయి. దీంతో బ‌స్సుల‌ను రోడ్డుపై నుంచి ప‌క్క‌కు తొల‌గించిన ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.

కాగా, ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని డాక్ట‌ర్లు వెల్లడించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించామ‌ని చెప్పారు.

Advertisement
Advertisement