త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Beer vs Cool Drink | కూల్‌డ్రింక్ కంటే బీరే మంచిద‌ట‌.. అందులోనే చ‌క్కెర‌, క్యాల‌రీలు త‌క్కువ‌ట‌!

Beer vs Cool Drink | ఎవ‌రైనా మ‌ద్యం సేవించొద్ద‌ని చెబుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే కూల్‌డ్రింక్స్‌, మ‌ద్యానికి దూరంగా ఉండాలంటారు. కానీ ఆ నాయ‌కుడు మాత్రం కూల్‌డ్రింక్ కంటే బీరే బెట‌ర్ (Beer vs Cool Drink) అని స‌ల‌హా ఇస్తున్నారు.

G

National | Published On Jun 29, 2026, 8.15 am IST

Beer vs Cool Drink | కూల్‌డ్రింక్ కంటే బీరే మంచిద‌ట‌.. అందులోనే చ‌క్కెర‌, క్యాల‌రీలు త‌క్కువ‌ట‌!
Advertisement

Beer vs Cool Drink | త్రినేత్ర‌.న్యూస్‌: ఎవ‌రైనా మ‌ద్యం సేవించొద్ద‌ని చెబుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే కూల్‌డ్రింక్స్‌, మ‌ద్యానికి దూరంగా ఉండాలంటారు. కానీ ఆ నాయ‌కుడు మాత్రం కూల్‌డ్రింక్ కంటే బీరే బెట‌ర్ (Beer vs Cool Drink) అని స‌ల‌హా ఇస్తున్నారు. తాగాల‌నపిస్తే కూల్ డ్రింక్ బ‌దులు బీర్ తీసుకోవాల‌ని చెబుతున్నారు. ఆయ‌నెవ‌రో కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టీడీపీ (TDP MLA) అధ్య‌క్షుడు, గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ (Palla Srinivas).

ఏపీలోని బీచ్‌ల్లో బీచ్‌ షాక్స్‌ (మద్యం షాపులు) ఏర్పాటు చేయాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ విష‌య‌మై ప‌ల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీచ్ షాక్స్ (Beach Socks) మంచివేనని, అవి చెడ్డవని చెప్పడానికి ఏమీ లేదన్నారు. కూల్‌డ్రింక్ (Cool Drink) కంటే బీరులోనే (Beer) తక్కువ కేలరీలు ఉంటాయని చెప్పారు. బీరుతో పోలిస్తే కూల్‌డ్రింక్‌లోనే చక్కెర స్థాయిలు ఎక్కువని పేర్కొన్నారు. కూల్‌డ్రింకులతో పోలిస్తే బీరులోనే చక్కెర, క్యాలరీల శాతం తక్కువగా ఉంటుందని చెప్పారు. బీచ్‌ల్లో బీచ్‌ షాక్స్‌ పేరిట మద్యం షాపులు ఏర్పాటు చేయడం మంచిదేనని, దానివల్ల సంస్కృతి దెబ్బతినదన్నారు. దీనివ‌ల్ల విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని సెల‌విచ్చారు.

Advertisement
Advertisement