త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG e-KYC | ఎల్‌పీజీకి ఈ-కేవైసీ..! స్ప‌ష్ట‌త ఇచ్చిన కేంద్రం

LPG e-KYC | వెస్ట్ ఆసియా ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య దేశంలో వంట‌గ్యాస్ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పెద్ద సంఖ్య‌లో జ‌నం సిలిండ‌ర్ల కోసం బారులు తీరుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిలిండ‌ర్ల బుకింగ్ గ‌డువును పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది.

P

National | Published On Mar 17, 2026, 4.01 pm IST

LPG e-KYC | ఎల్‌పీజీకి ఈ-కేవైసీ..! స్ప‌ష్ట‌త ఇచ్చిన కేంద్రం
Advertisement

LPG e-KYC | వెస్ట్ ఆసియా ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య దేశంలో వంట‌గ్యాస్ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పెద్ద సంఖ్య‌లో జ‌నం సిలిండ‌ర్ల కోసం బారులు తీరుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిలిండ‌ర్ల బుకింగ్ గ‌డువును పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అదే స‌మ‌యంలో గ్యాస్ వినియోగ‌దారులు త‌ప్ప‌నిస‌రిగా ఈ-కేవైసీ త‌ప్ప‌నిస‌రిగా ప‌ని చేయాల‌ని ఇటీవ‌ల ఆదేశింది. దాంతో వినియోగ‌దారులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఇప్ప‌టికే ప‌లువురు కేవైసీ పూర్తి చేయ‌డంతో మ‌ళ్లీ కేవైసీ చేయాలా? అన్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు గ్యాస్ ఏజెన్సీల‌కు ప‌రుగులు తీస్తున్నారు. తాజాగా దీనిపై కేంద్రం మంగళవారం కీలక వివరణ ఇచ్చింది. బయోమెట్రిక్ ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను ఇప్పటివరకు పూర్తి చేయని ఎల్‌పీజీ వినియోగదారులకు మాత్రమే ఇది అవసరమని స్పష్టం చేసింది.

దేశంలో 33కోట్ల‌కుపైగా ఎల్‌పీజీ వినియోగ‌దారులు

దేశంలో 33 కోట్లకు పైగా ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 10.51 కోట్ల మంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ఉన్నారు. ఉజ్వల పథకం కింద డిపాజిట్ లేకుండా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి అయినప్పటికీ, ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన ఇతర వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయని వినియోగదారులకే ఇది వర్తిస్తుంద‌ని, నాన్-పీఎంయూవై కస్టమర్లు ఒకసారి పూర్తి చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేద‌ని పెట్రోలియం మంత్రిత్వ‌శాఖ ఎక్స్ హ్యాండిల్ ద్వారా మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

ఇంట్లో నుంచే ఈ-కేవైసీ ఎలా చేయాలంటే..?

  • ఎల్‌పీజీ ప్రొవైడ‌ర్ యాప్ (ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం) డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫోన్‌లో Aadhaar FaceRD యాప్ ఇన్‌స్టాల్ చేయాలి.
  • రిజిస్టర్ మొబైల్ నంబర్, ఎల్‌పీజీ ఐడీతో లాగిన్ అవ్వాలి.
  • e-KYC, ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆధార్ వివరాలు నమోదు చేసి, మొబైల్ నంబర్ లింక్ అయ్యిందో చూడాలి.
  • FaceRD యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి.
  • సూచనల ప్రకారం ఫేషియల్ స్కాన్ చేయండి
  • చివరగా సబ్మిట్ చేసి ప్రక్రియను పూర్తి చేయండి.

మార్చి 15న అన్ని గృహ ఎల్‌పీజీ వినియోగదారులు ఈ-కేవైసీ చేయాలని మంత్రిత్వ‌శాఖ సూచించింది. ఆ త‌ర్వాత కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో తాజాగా మ‌రోసారి వివ‌ర‌ణ ఇచ్చింది. వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రోత్సహించే చర్యల్లో భాగమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేయాలని తెలిపింది. ఏడు సిలిండర్లు తీసుకున్న తర్వాత ఎనిమిదో, తొమ్మిదో సిలిండర్లపై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సబ్సిడీ పొందేందుకు ఈ-కేవైసీ అవసరమని వెల్లడించింది. ఇంట్లో నుంచే ఉచితంగా ఈ-కేవైసీ చేయవచ్చని, గ్యాస్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ వల్ల పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన వారికి సబ్సిడీ అందుతుంద‌ని, నకిలీ కనెక్షన్లు తగ్గుతాయని పేర్కొంది.

ఇక పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ ఇటీవల రాజ్యసభలో మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 14.2 కిలోల సిలిండర్లపై ఏడాదికి గరిష్టంగా తొమ్మిది సార్లు ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎల్‌పీజీ మార్కెట్‌ను ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇటీవల ఇవి గృహ వినియోగ గ్యాస్ ధరను ఒక్కో సిలిండర్‌పై రూ.60 పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.913గా ఉండగా, ఉజ్వల లబ్ధిదారులకు సబ్సిడీ తర్వాత రూ.613కు లభిస్తోంది.

https://x.com/PetroleumMin/status/2031349121471414275

Advertisement

తాజావార్తలు

Advertisement