త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఏడు కోట్ల బ‌డ్జెట్ – 3100 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హార‌ర్ మూవీ – తెలుగులో రిలీజ్‌

సైక‌లాజిక‌ల్ హార‌ర్ మూవీ అబ్సెష‌న్ హాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక లాభాల‌ను ఆర్జించిన‌ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ హార‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూన్ 30 నుంచి యాపిల్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jun 29, 2026, 10.21 am IST

OTT | ఏడు కోట్ల బ‌డ్జెట్ – 3100 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హార‌ర్ మూవీ – తెలుగులో రిలీజ్‌
Advertisement

OTT | ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన హాలీవుడ్ మూవీ అబ్సెష‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవ‌లం ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో కొత్త న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌తో రూపొందిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 3100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. హాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.

రెండు ఓటీటీల‌లో...

అబ్సెష‌న్ ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ గుడ్‌న్యూస్ వినిపించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. జూన్ 30న యాపిల్ టీవీ ఓటీటీలో ఈ సైక‌లాజిక‌ల్ హార‌ర్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంద‌ట‌. ఓటీటీ కోసం మేక‌ర్స్ కొన్ని కొత్త హార‌ర్‌ సీన్ల‌ను యాడ్ చేయ‌బోతున్నార‌ట‌. యాపిల్ టీవీ ఓటీటీతోపాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

క‌ర్రీ బార్క‌ర్‌...

అబ్సేష‌న్ మూవీకి క‌ర్రీ బార్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మైఖేల్ జాన్స‌న్‌, ఇండీ న‌వ‌రెట్టే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అతీంద్రియ శ‌క్తుల సాయంతో ఓ యువ‌తి ప్రేమ‌ను ద‌క్కించుకోవాల‌ని అనుకున్న ప్రేమికుడికి ఎలాంటి భ‌యాన‌క‌మైన ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌నే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కింది.

వ‌న్ విష్ విల్లో....

బేర్‌, నిక్కీ ఫ్రీమాన్ ఓ మ్యూజిక్ స్టోర్‌లో ప‌నిచేస్తుంటారు. నిక్కీని బేర్ ప్రేమిస్తుంటాడు. వ‌న్ విష్ విల్లో అనే తాంత్రిక శ‌క్తులు ఉన్న బొమ్మ గురించి బేర్‌కు తెలుస్తుంది. ఆ బొమ్మ‌ను విరిచేసి ప్ర‌పంచంలో అంద‌రికంటే ఎక్కువ‌గా నిక్కీ త‌న‌నే ప్రేమించాల‌ని కోరుకుంటాడు. ఆ బొమ్మ విరిచిన‌ప్ప‌టి నుంచి నిక్కీ ప్ర‌వ‌ర్త‌న మారిపోతుంది. బేర్ ప్రేమ కోసం త‌న స్నేహితురాలు సారానే దారుణంగా చంపేస్తుంది నిక్కీ. వ‌న్ విష్ విల్లో బారి నుంచి నిక్కీని బేర్ కాపాడాడా? ఆ బొమ్మ వ‌ల్లే నిక్కీ అలా మారిపోయిందా? నిజంగానే బేర్‌ను నిక్కీ ప్రేమించిందా? నిక్కీ ప్రాణాలు కాపాడటం కోసం బేర్ ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు అన్న‌దే అబ్సెష‌న్ మూవీ క‌థ‌

 

Advertisement
Advertisement