త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DCP Shilpavalli | టీ ష‌ర్ట్స్ తేసేసి.. బనియ‌న్స్‌పై అసెంబ్లీలోకి వెళ్తామ‌న్నారు.. మేం మ‌హిళ‌ల ప‌ట్ల అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించ‌లే: డీసీపీ శిల్ప‌వ‌ల్లి

DCP Shilpavalli | బీఆర్ఎస్ నేతలు న‌లుపురంగు టీ షర్ట్స్ ధరించి, నినాదాలు చేస్తూ వ‌చ్చార‌ని డీసీపీ శిల్పవల్లి చెప్పారు. వారి టీ షర్ట్స్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారని, అందుకే వారిని అసెంబ్లీ లోపలికి అనుమతించలేద‌న్నారు. తాము మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించార‌ని చెబుతున్నారని, అది అబద్ధం అని డీసీపీ వెల్ల‌డించారు.

G

Telangana | Published On Sep 7, 2026, 12.03 pm IST

DCP Shilpavalli | టీ ష‌ర్ట్స్ తేసేసి.. బనియ‌న్స్‌పై అసెంబ్లీలోకి వెళ్తామ‌న్నారు.. మేం మ‌హిళ‌ల ప‌ట్ల అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించ‌లే: డీసీపీ శిల్ప‌వ‌ల్లి
Advertisement

DCP Shilpavalli | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ స‌మావేశాలు (Assembly Session) ప్రారంభ‌మైన తొలిరోజే తీవ్ర ఉద్రిత్త‌త నెల‌కొంది. న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి అసెంబ్లీ లోప‌లికి వెళ్లేందుకు బీఆర్ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నించ‌డంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరుప‌క్షాల మ‌ధ్య‌త తీవ్ర‌వ్యాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తోపులాట‌లో ప‌లువురు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కింద‌ప‌డిపోయారు. పోలీసులు త‌న‌ప‌ట్ల అమ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌వ‌ర్తించారంటూ మాజీ మంత్రి, న‌ర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు అసెంబ్లీ గేటు వ‌ద్దే త‌న టీ ష‌ర్ట్ విప్పి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ఎదుట చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై డీసీపీ శిల్పవల్లి (DCP Shilpavalli) స్పందించారు.

బీఆర్ఎస్ నేతలు న‌లుపురంగు టీ షర్ట్స్ ధరించి, నినాదాలు చేస్తూ వ‌చ్చార‌ని చెప్పారు. వారి టీ షర్ట్స్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారని, అందుకే వారిని అసెంబ్లీ లోపలికి అనుమతించలేద‌న్నారు. నల్ల దుస్తులు ధరించి రావడంలో తప్పులేదని, నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పు కాదని వెల్ల‌డించారు. కానీ బ్లాక్ టీషర్ట్స్ (Black T Shirts) పైన స్లోగన్స్ రాసుకొని రావటమే తప్పు అని స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ ఎదుట టీ షర్ట్స్ తీసేసి బనియన్స్తో లోపలికి వెళ్తామన్నారని, దానికి తాము అంగీకరించలేదని చెప్పారు.

బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనేది అవాస్తవమని, ఎవరి పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించలేదని వెల్ల‌డించారు. బీఆర్ఎస్ నేతలను నియంత్రించ‌డానికి చాలా ప్రయత్నించామన్నారు. తాము మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించార‌ని చెబుతున్నారని, అది అబద్ధం అని డీసీపీ చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement