Municipal Elections | అత్తపై గెలిచిన కోడలు.. తోడికోడళ్లలో అక్కదే విజయం..
Municipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) హోరాహోరీగా సాగాయి. అధికార పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోగా, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ గట్టిపోటీనిచ్చాయి. ఈ ఎన్నికల్లో పలు చోట్ల భార్యభర్తలు, తండ్రీకొడులు, అత్తాకోడళ్లు విజయం సాధించారు.
Municipal Elections | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) హోరాహోరీగా సాగాయి. అధికార పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోగా, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ గట్టిపోటీనిచ్చాయి. ఈ ఎన్నికల్లో పలు చోట్ల భార్యభర్తలు, తండ్రీకొడులు, అత్తాకోడళ్లు విజయం సాధించారు. అయితే జనగామలో అత్తపై పోటీచేసిన కోడలు గెలుపొందగా, జగిత్యాలలో తోడికోడళ్లు బరిలో నిలవగా అక్కనే విజయం వరించింది.
జనగామ మున్సిపాలిటీలోని 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీరటి రజని పోటీచేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె అత్త (మేనమామ భార్య) నీలం శ్రీలత బరిలో నిలిచారు. అయితే ఓటర్లు కోడలైన రజనీకి గెలుపును కట్టబెట్టారు.
ఇక అదే మున్సిపాలిటీలో 19వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దోర్నాల అనిత, ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా ఆమె తోడికోడలు అశ్విని పోటీ చేశారు. భారాస, భాజపా సహా నలుగురు అభ్యర్థులు పోటీపడగా అనితను విజయం సాధించారు. అనితకు 435 ఓట్లు రాగా, అశ్వినికి 44 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురిలో అత్తాకోడళ్లు విజయం సాధించారు. వేముల నాగలక్ష్మి 5వ వార్డు నుంచి, ఆమె అత్త వేముల రమాదేవి 14వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే వేర్వేరు వార్డుల్లో పోటీచేడంతో ఇద్దరిని కౌన్సిలర్లుగా ప్రజలు ఎన్నుకున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో ఒకే ఇంటి నుంచి ముగ్గురు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. తండ్రి, ఆయన ఇద్దరు కుమారులు పోటీచేసి గెలుపొందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండీ జాబీర్ అహ్మద్ 20వ వార్డు నుంచి, ఆయన కుమారులు అమేర్ అహ్మద్ 2వ వార్డు, నాజర్ అహ్మద్ 17వ వార్డు నుంచి ఎన్నికయ్యారు. జాబీర్ రెండు సార్లు చైర్మన్‌గా, రెండుసార్లు వైస్‌చైర్మన్‌గా పనిచేయగా, అమేర్ గత పాలక వర్గంలో కౌన్సిలర్‌గా పనిచేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



