Dasara Holidays | అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. ముఖ్యమైన తేదీలివే..!
Dasara Holidays | తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ( Dasara ) సందడి మొదలైంది. వచ్చే నెలలోనే దసరా ఉండడంతో.. ఇప్పట్నుంచే విద్యార్థులు సెలవులపై దృష్టి పెట్టారు. సెలవులను ఎలా ఎంజాయ్ చేయాలి.. అని ఆలోచన చేస్తున్నారు.
Dasara Holidays | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ( Dasara ) సందడి మొదలైంది. వచ్చే నెలలోనే దసరా ఉండడంతో.. ఇప్పట్నుంచే విద్యార్థులు సెలవులపై దృష్టి పెట్టారు. సెలవులను ఎలా ఎంజాయ్ చేయాలి.. అని ఆలోచన చేస్తున్నారు. 13 రోజులు సెలవులు వస్తుండడంతో.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలని పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
2026-27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఖరారు చేశారు. మొత్తం 13 రోజులు హాలీడేస్. అక్టోబర్ 23న స్కూల్స్ తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులకు చివరి వర్కింగ్ డే వచ్చేసి అక్టోబర్ 9.
20న దసరా పండుగ
రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 20న దసరా పండుగ జరుపుకోనున్నారు. పండుగకు తమ సొంతూర్లకు వెళ్లేందుకు అందరూ ప్లాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షాపింగ్‌ల బాట పట్టారు. సెలవు దొరికినప్పుడల్లా షాపింగ్ మాల్స్‌లో వాలిపోతున్నారు.
బతుకమ్మ ఎప్పుడంటే..?
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అక్టోబర్ 11న బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. అక్టోబర్ 19న సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది.
ముఖ్యమైన తేదీలివే..
దసరా హాలీడేస్ ప్రారంభం - అక్టోబర్ 10, 2026
బతుకమ్మ వేడుకలు ప్రారంభం - అక్టోబర్ 11, 2026
సద్దుల బతుకమ్మ - అక్టోబర్ 19
దసరా పండుగ - అక్టోబర్ 20
దసరా హాలీడేస్ ముగింపు - అక్టోబర్ 22, 2026
స్కూల్స్ రీఓపెన్ - అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●HMWSSB | త్వరలోనే పెరగనున్న నీటి బిల్లులు..! ప్రజలపై అదనంగా రూ. 60 కోట్ల భారం..!!
- ●బీఆర్ఎస్కు కౌంటర్ సరే సీఎం సాబ్… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?
- ●Heat Wave | హైదరాబాద్‌లో మండుటెండలు.. 40 డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు
- ●Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ పనులకు మోక్షం..!
- ●Vastu Tips | ఈ నాలుగు మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక నష్టాలు..!

HMWSSB | త్వరలోనే పెరగనున్న నీటి బిల్లులు..! ప్రజలపై అదనంగా రూ. 60 కోట్ల భారం..!!

బీఆర్ఎస్కు కౌంటర్ సరే సీఎం సాబ్… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?

Heat Wave | హైదరాబాద్‌లో మండుటెండలు.. 40 డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు

Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ పనులకు మోక్షం..!






