త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodara Raja Narsimha | 99 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను విజ‌యవంతం చేయాలి: మంత్రి దామోద‌ర‌

Damodara Raja Narsimha | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్రణాళిక కార్య‌క్ర‌మంలో (Praja Palana- Pragati Pranalika) భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న 99 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయాల‌ని మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ (Damodara Raja Narsimha) అధికారుల‌ను ఆదేశించారు.

G

Telangana | Published On Mar 6, 2026, 12.15 pm IST

Damodara Raja Narsimha | 99 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను విజ‌యవంతం చేయాలి: మంత్రి దామోద‌ర‌
Advertisement

Damodara Raja Narsimha | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్రణాళిక కార్య‌క్ర‌మంలో (Praja Palana- Pragati Pranalika) భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న 99 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయాల‌ని మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ (Damodara Raja Narsimha) అధికారుల‌ను ఆదేశించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగిన స‌న్నాహ‌క స‌మావేశంలో మంత్రి పాల్గొన్నారు.

రెండేండ్ల‌ పాలనను వివరించడంతో పాటు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 6 నుంచి) 99 రోజుల‌పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వ‌హించ నుంది. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరిలో 3 రోజుల పాటు రెండోసారి ప్రజా పాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించింది. ఇప్పుడు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం చేపట్టింది.

ఇందులో భాగంగా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జిల్లాల ఇనాచార్జి మంత్రుల ఆధ్వర్యంలో శుక్ర‌వారం సన్నాహక సమావేశాలు నిర్వ‌హిస్తున్న‌ది. నేటి నుంచి ఈనెల 15 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం చేపట్టనున్నారు. జూన్ 12న ఈ కార్య‌క్ర‌మం ముగియ‌నుంది.

Also Read..

ఫైన‌ల్‌లో అభిషేక్‌ను ఆడించ‌డంపై ర‌విశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు

తిరుమ‌ల‌లో త‌నూజ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసిన దివ్వెల మాధురి - కేసు న‌మోదు చేసిన పోలీసులు

తెలంగాణ ప్రజల గొంతు కోసి.. కేరళలో కలర్ పేజీ యాడ్స్.. కాంగ్రెస్‌పై హ‌రీశ్ ఆగ్ర‌హం

 

Advertisement
Advertisement