త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Divvela Madhuri | తిరుమ‌ల‌లో త‌నూజ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసిన దివ్వెల మాధురి – కేసు న‌మోదు చేసిన పోలీసులు

బిగ్‌బాస్ సీజ‌న్ 9 కంటెస్టెంట్స్ త‌నూజ‌, దివ్వెల మాధురిల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిబంధ‌న‌ల‌ను విరుద్ధంగా తిరుమ‌ల‌లో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసినందుకు వీరిపై టీటీడీ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

N

Entertainment | Published On Mar 6, 2026, 11.53 am IST

Divvela Madhuri | తిరుమ‌ల‌లో త‌నూజ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసిన దివ్వెల మాధురి – కేసు న‌మోదు చేసిన పోలీసులు
Advertisement

Divvela Madhuri |  బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 కంటెస్టెంట్స్ త‌నూజ‌, దివ్వెల మాధురి చిక్కుల్లో ప‌డ్డారు. తిరుమ‌ల‌లో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించినందుకు వీరిపై టీటీడీ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గురువారం త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బిగ్‌బాస్ ర‌న్న‌ర‌న్ త‌నూజ , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురితో క‌లిసి తిరుమ‌ల‌ను ద‌ర్శించుకుంది. శ్రీవిభ‌వ అతిథి గృహంలో వీరు బ‌స చేశారు.

కేక్ తెప్పించి...

త‌నూజ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ను అతిథి గృహంలోనే దివ్వెల మాధురి నిర్వ‌హించింది. కేక్ తెప్పించి త‌నూజ చేత క‌ట్ చేయించింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో వైర్ అయ్యింది. తిరుమ‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం కొండ‌పైకి కేక్ తీసుకెళ్లడం, క‌ట్ చేయ‌డం నిషేదం. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినందుకు త‌నూజ‌తో పాటు దివ్వెల మాధురిల‌పై టీటీడీ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల కంప్లైంట్‌ను స్వీక‌రించిన పోలీసులు ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది.

గీతూ రాయ‌ల్ కూడా...

గ‌తంలో దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి శ్రీవారి ఆల‌యం ముందు పుష్క‌రిణి స‌మీపంలో ఫొటో షూట్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌తో మ‌రోసారి వీరిపై భ‌క్తులు మండిప‌డుతున్నారు. ఇటీవ‌లే మ‌రో బిగ్‌బాస్ బ్యూటీ గీతూరాయ‌ల్ కూడా ఇటీవ‌ల తిరుమ‌ల‌లో ఓ రీల్ చేయ‌డంపై దారుణంగా ట్రోల్స్ వ‌చ్చాయి.కాగా త‌నూజ‌, దివ్వెల మాధురి ఇద్ద‌రూ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. త‌నూజ ర‌న్న‌ర‌ప్‌గా నిల‌వ‌గా...వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన మాధురి 56వ రోజు ఎలిమినేట్ అయ్యింది.

Advertisement
Advertisement