Ravi Shastri | ఫైనల్లో అభిషేక్‌ను ఆడించడంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
Ravi Shastri | భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి భారత వికెట్‌కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ మానసిక ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో అతను నిజంగా పరిపక్వత సాధించాడని అన్నారు. స్థిరత్వం అవసరమని గ్రహించడం, షాట్ సెలెక్షన్‌లో తెలివిగా వ్యవహరించడం వల్లే శాంసన్ మంచి ఫలితాలు సాధిస్తున్నాడని శాస్త్రి అన్నారు.
Ravi Shastri | భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి భారత వికెట్‌కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ మానసిక ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో అతను నిజంగా పరిపక్వత సాధించాడని అన్నారు. స్థిరత్వం అవసరమని గ్రహించడం, షాట్ సెలెక్షన్‌లో తెలివిగా వ్యవహరించడం వల్లే శాంసన్ మంచి ఫలితాలు సాధిస్తున్నాడని శాస్త్రి అన్నారు. ఇంగ్లండ్‌పై జరిగిన సెమీఫైనల్లో శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్‌కు 7 పరుగుల తేడాతో విజయం అందించాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 50 బంతుల్లో 97 పరుగులు చేసి భారత్ 5 వికెట్ల తేడాతో గెలవడానికి పునాది వేశాడు. సంజు శాంసన్ ఇప్పుడు తాను మరింత స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉందని గ్రహిస్తున్నాడు. షాట్ సెలెక్షన్‌లో మరింత తెలివిగా ఉండాలి, తన బలాలను నమ్మాలి. శాంసన్ దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయి. కానీ కొన్ని సార్లు ఏకాగ్రత లోపిస్తోంది.. అని శాస్త్రి పేర్కొన్నారు.
సంజు మానసికంగా బలంగా ఉన్నాడు..
సంజు మానసికంగా కూడా బలంగా మారాడని శాస్త్రి అన్నారు. శాంసన్ ప్రతిభపై ఎప్పుడూ ఎవరూ సందేహం వ్యక్తం చేయలేదు. జట్టులోకి వచ్చినప్పటి నుంచి అతని టాలెంట్ అందరికీ తెలిసిందే. కానీ అతను ఇప్పటివరకు చూపాల్సిన స్థిరత్వం రాలేదని చాలా మంది నిరాశ చెందారు. ఇప్పుడు మాత్రం అతను నిజంగా ఎదిగాడు.. అని శాస్త్రి చెప్పారు. కాగా భారత్ జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ తో ఆదివారం అహ్మదాబాద్‌లో తలపడనుంది. టోర్నమెంట్ ప్రారంభంలో శాంసన్‌కు అవకాశాలు రాలేదు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయగా, మిడిలార్డర్‌లో రింకు సింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే తరువాత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న శాంసన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని టోర్నమెంట్‌ను తనదైన శైలిలో ముందుకు సాగించాడు.
అభిషేక్‌ను ఆడించాలా..?
శాంసన్ నుంచి ఇంకా ఉత్తమ ప్రదర్శనలు రావాల్సి ఉంది. అతను ఇప్పటికీ కేవలం 31 ఏళ్ల వయస్సులోనే ఉన్నాడు. నిజమైన మ్యాచ్ విన్నర్. అతను ఆడే షాట్లు చూస్తే క్లాస్, టచ్, పవర్ అన్నీ కనిపిస్తాయి. అది అద్భుతం.. అని రవిశాస్త్రి అన్నారు. ఇక అభిషేక్ శర్మ ఫామ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఫైనల్‌కు జట్టులో మార్పులు చేయకుండా అభిషేక్‌పై విశ్వాసం ఉంచాలని సూచించారు. ఇప్పుడైనా అతడిని కొనసాగించాలి. జట్టు మంచి రన్‌లో ఉంది కాబట్టి మార్పులు అవసరం లేదు. అతడికి తన సామర్థ్యాన్ని నమ్మమని చెప్పాలి. భయపడకుండా తన బలాలను ఉపయోగించి ఆడాలి. చివరి మ్యాచ్ అతనికి ఉత్తమ మ్యాచ్ కావచ్చు అని రవిశాస్త్రి అన్నారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



