త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Deworming Day | రేపే జాతీయ నులి పురుగుల నివార‌ణ దినోత్స‌వం..

National Deworming Day | జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Jul 12, 2026, 3.19 pm IST

National Deworming Day | రేపే జాతీయ నులి పురుగుల నివార‌ణ దినోత్స‌వం..
Advertisement

National Deworming Day | త్రినేత్ర‌.న్యూస్ : జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ పిలుపునిచ్చారు. జూలై 13న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు కలిసి అర్హులైన ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్ర అందేలా సహకరించండి అని కోరారు. మన పిల్లలను ఆరోగ్యంగా ఉంచుదాం.. ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మిద్దాం అని చెప్పారు.

జాతీయ నులి పురుగుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జూలై 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో, పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో ఆల్బెండ‌జోల్ మాత్ర‌ను విద్యార్థుల‌కు అందించ‌నున్నారు. 96.81 ల‌క్ష‌ల మంది చిన్నారులు, కౌమ‌ర ద‌శ పిల్ల‌లు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోనున్నారు.

Advertisement
Advertisement