Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
Ebola virus disease | డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్, తదితర అంశాలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Ebola virus disease | త్రినేత్ర.న్యూస్ : డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్, తదితర అంశాలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. శంషాబాద్ విమానాశ్రయంలో అమలులో ఉన్న స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
వారిద్దరికీ వైరస్ నెగిటివ్
అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి, గాంధీ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఇద్దరు అనుమానితులను గాంధీలో ఐసోలేషన్‌లో ఉంచి, వారి సాంపిల్స్‌ను టెస్టుల కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా... అక్కడ చేసిన టెస్టుల్లో వారి ఇద్దరికీ వైరస్ నెగిటివ్ వచ్చిందని మంత్రికి వివరించారు. ఐసీఎంఆర్ సూచన మేరకు వారి సాంపిల్స్‌ను మరోసారి సేకరించి టెస్టుల కోసం పూణేలోని ఎన్‌ఐవీకి పంపించామని చెప్పారు.
తప్పుడు సమాచారం అందించినట్లయితే చట్టపరమైన చర్యలు
విదేశాల నుంచి వచ్చే కొంత మంది ప్రయాణికులు తమకు ఇచ్చిన అడ్రస్‌లో ఉండడం లేదని అధికారులు మంత్రికి తెలుపగా, మంత్రి సీరియస్‌గా స్పందించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను కచ్చితంగా, సక్రమంగా అందించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం అందించినట్లయితే చట్టపరమైన చర్యలు, కేసుల నమోదు వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సంతోష్ చౌహాన్, కేంద్ర ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పావని, జీఎంఆర్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సంజయ్ కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, రంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి, ఐడీఎస్‌పీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శివ బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 8, 2026

Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?
జూన్ 8, 2026

Bhatti Vikramarka | లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌ను స్కిప్ చేసిన జాన్వీ - అచ్చియమ్మ పేరు ఎత్తని చరణ్
- ●CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్
- ●Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌ను స్కిప్ చేసిన జాన్వీ - అచ్చియమ్మ పేరు ఎత్తని చరణ్

CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి



