High Court | రెండు వారాల జైలుశిక్ష.. హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీ
High Court | కోర్టు ధిక్కరణ కింద సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి హైకోర్టు (High Court) రెండు వారాల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఇరువురు అధికారులు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
High Court | త్రినేత్ర న్యూస్: కోర్టు ధిక్కరణ కింద సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి హైకోర్టు (High Court) రెండు వారాల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఇరువురు అధికారులు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తమకు విధించిన 2 వారాల జైలు శిక్షపై అప్పీల్‌చేశారు. భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలన్న కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో సైబరాబాద్ సీపీ (CP Ramesh Reddy), మేడ్చల్ డీసీపీపై (DCP Koti Reddy) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఇద్దరికీ రెండు వారాల జైలు శిక్షతోపాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారం జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును వారం రోజులు నిలిపివేసింది. దీంతో తమకు కేసుతో సంబంధం లేదంటూ డివిజన్ బెంచ్‌లో (Division Bench) అఫిడవిట్ దాఖలు చేశారు.
ఎలాంటి కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడలేదంటూ అందులో పేర్కొన్నారు. మరోవైపు కోర్టు ఉత్తర్వులను ఉల్లగించినట్లు పాల్పడితే క్షమాపణకు సిద్ధమని వెల్లడించారు. జీడిమెట్ల 6 ఎకరాల 15 గుంటల భూ వివాదంలో ఒక పక్షానికి అనుకూలంగా డీసీపీ వ్యవహరించినట్లు బాధితుడు ప్రవీణ్ ఆరోపించారు. అయితే అఫిడవిట్‌లో కేవలం ప్రవీణ్‌పై ఫోర్జరీ కేసులు మాత్రమే పేర్కొన్నారు. మరో పార్టీ తొట్టెంపూడి హర్షవర్ధన్ కేసులను మెన్షన్ చేయని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
నవంబర్ 29, 2026

HMDA Truck Parking | సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ.. హెచ్ఎండీఏ వేలం విఫలం!
నవంబర్ 27, 2026

Kukatpally Truck Park | కూకట్పల్లి ట్రక్‌పార్క్ భూముల వేలానికి లైన్ క్లియర్.. పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
నవంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి
- ●Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?
- ●Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం
- ●Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ - రూమర్లకు చెక్ పెట్టిన కాకా
- ●Softball | జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్.. ఖేలో ఇండియాలో తొలిసారి అవకాశం
- ●Khelo India Games | ఓరుగల్లు నుంచి పాలమూరు వరకు.. జిల్లాల్లోనూ జాతీయ క్రీడల సందడి

Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి

Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?

Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం

Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ - రూమర్లకు చెక్ పెట్టిన కాకా



