Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ – రూమర్లకు చెక్ పెట్టిన కాకా
చిరంజీవి కాకా మూవీ పోస్ట్‌పోన్ అయినట్లు గత కొద్దిరోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు మెగాస్టార్ అఫీషియల్‌గా చెక్ పెట్టారు. కాకా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఆటోజానీ లుక్‌తో కూడిన ఓ కొత్త క పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
Entertainment | Published On Nov 29, 2026, 12.34 pm IST
Chiranjeevi | చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న కాకా మూవీ సంక్రాంతి రేసు (Sankranthi )నుంచి తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. కాకా ప్లేస్‌లో చిరంజీవి మరో మూవీ విశ్వంభర పండుగ బరిలో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకా పోస్ట్‌పోన్ రూమర్లకు అఫీషియల్‌గా చిరంజీవి చెక్ పెట్టారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
ఆటో జానీగా....
ఈ పోస్టర్‌లో చిరంజీవి (Chiranjeevi) ఆటోజానీ లుక్‌లో కనిపిస్తున్నారు. రౌడీ అల్లుడు సినిమాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆటోజానీ క్యారెక్టర్‌ను కాకా కోసం మళ్లీ రీక్రియేట్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్‌తో హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో ఆటో డ్రైవర్‌గా ఖాకీ డ్రెస్‌లో కాలర్ ఎగరేస్తూ చిరంజీవి రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. "ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా కాకాతో మీ ముందుకు వస్తున్నాడు" అంటూ ఈ పోస్టర్‌ను ఉద్దేశించి చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఆటో జానీలోని కొత్త యాంగిల్‌ను సంక్రాంతికి చూడబోతున్నారని అన్నాడు. ఈ పోస్టర్‌తో పాటు చిరంజీవి పోస్ట్ వైరల్ అవుతోన్నాయి.
అనస్వర రాజన్....
కాకా మూవీలో మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్‌తో (Anaswara Rajan),పాటు నివేదా పేతురాజ్, రచితారామ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది.
ఆటో జానీ గుర్తున్నాడా? 😉
ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKA లో మీ ముందుకు వస్తున్నాడు!Looking forward to entertaining you all this Sankranthi with a whole new side of ‘Auto Johnny’.
@dirbobby and the entire team are putting their heart and soul into making #KAAKA a memorable theatrical experience.
See you all in theatres worldwide on January 13, 2027. ❤️
సంక్రాంతికి కలుద్దాం🤗
#AutoJohnnyIsBack @KvnProductions
#KAAKAOnJan13— Chiranjeevi Konidela (@KChiruTweets) November 29, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
- ●Tirupparankundram | భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుప్పరంకుండ్రం కొండపై డిసెంబర్ 15 దాకా దీపాలు వెలిగించొచ్చు!
- ●Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి
- ●Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?
- ●Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం
- ●High Court | రెండు వారాల జైలుశిక్ష.. హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీ

Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!

Tirupparankundram | భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుప్పరంకుండ్రం కొండపై డిసెంబర్ 15 దాకా దీపాలు వెలిగించొచ్చు!

Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి

Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?






