Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
Drunk and Drive Cases | సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ (Special Drunk and Drive) నిర్వహించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ జి.నరేెందర్ తెలిపారు.
Drunk and Drive Cases | త్రినేత్ర న్యూస్: సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ (Special Drunk and Drive) నిర్వహించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ జి.నరేెందర్ తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి 300 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారని చెప్పారు. 245 ద్విచక్ర వాహనదారులు, 15 ఆటోలు, 39 కార్లు, 1 హెవీ వాహనదారులపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా కేసులను చూస్తే.. 248 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 39 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 13 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ కోర్టుకు హాజరుపర్చనున్నట్లు అదనపు డీసీపీ తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్ర నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
గత వారం పరిష్కారమైనవి..
కాగా గత వారం 199 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. 8 మందికి జరిమానా, జైలు శిక్ష, 11 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 180 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి
- ●Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?
- ●Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం
- ●Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ - రూమర్లకు చెక్ పెట్టిన కాకా
- ●High Court | రెండు వారాల జైలుశిక్ష.. హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీ
- ●Softball | జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్.. ఖేలో ఇండియాలో తొలిసారి అవకాశం

Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి

Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?

Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం

Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ - రూమర్లకు చెక్ పెట్టిన కాకా




