Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?
Uttam Kumar Reddy | మూడు కోట్ల మంది ఓటర్లున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగో వంతు మంది చనిపోయారనో, రాష్ట్రం విడిచి వెళ్లిపోయారనో, అదృశ్యమయ్యారనో చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మండిపడ్డారు.
సంక్షిప్త సారాంశం
ఎస్‌ఐఆర్ (SIR) పేరుతో తెలంగాణలో ఏకంగా 73.18 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారన్న విషయమై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మూడు కోట్ల మంది ఓటర్లున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగో వంతు మంది చనిపోయారనో, రాష్ట్రం విడిచి వెళ్లిపోయారనో, అదృశ్యమయ్యారనో చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదన్నారు.
- ఇలా చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదు
- అసలు 73.18 లక్షల ఓట్లు తీసేయడాన్ని నమ్మలేకపోతున్నా
- ఈ డీలిమిటేషన్ ఇంకా భయంకరమే
- ఎస్ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్: మూడు కోట్ల మంది ఓటర్లున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగో వంతు మంది చనిపోయారనో, రాష్ట్రం విడిచి వెళ్లిపోయారనో, అదృశ్యమయ్యారనో చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ (SIR) పేరుతో తెలంగాణలో ఏకంగా 73.18 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారన్న విషయమై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ది హిందూ హడిల్’ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. డీలిమిటేషన్ (Delimitation) ఇంకా ఆందోళనకరంగానే ఉందన్నారు. తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైనదని, ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికావడం అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామమని పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసమే ప్రాణం
“నేను వరుసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించాను. సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉంటూ రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నాను. అలాంటి నాకు కూడా 73.18 లక్షల మంది ఓటర్లు చనిపోయారనో, ఎక్కడికో వెళ్లిపోయారనో నమ్మడం సాధ్యం కావడం లేదు. ఇది సాధారణ గణాంకం కాదు.. ప్రజాస్వామ్యాన్ని అప్రమత్తం చేస్తున్న ప్రమాద ఘంటిక” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియకు నిష్పాక్షికత, పారదర్శకత, ప్రజల విశ్వాసమే ప్రాణమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
ఇది మరింత ప్రమాదకరం
జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న పరిస్థితి ఏర్పడటం ఒక పౌరుడిగా తనను తీవ్రంగా కలవరపెడుతోందని చెప్పారు. దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగనున్నదని గుర్తుచేశారు. ఈ ప్రక్రియపై సమర్థమైన న్యాయపరమైన పరిహారానికి అవకాశం లేకపోవడం మరింత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం తన ప్రతి చర్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని, భారీ స్థాయిలో జరిగిన ఓట్ల తొలగింపుపై పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నేతల ఆందోళన.. కర్రలతో స్థానికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
నవంబర్ 29, 2026

Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
నవంబర్ 29, 2026

Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నేతల ఆందోళన.. కర్రలతో స్థానికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
- ●Bill Gates Warns | ఏఐతో ప్రపంచానికి సైబర్ ముప్పు.. ఆస్పత్రులు, బ్యాంకులపై హ్యాకర్ల గురి! బిల్ గేట్స్ సంచలన హెచ్చరిక
- ●Sridhar Babu | మెట్రో స్టేషన్ల వద్ద ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గించండి..: మంత్రి శ్రీధర్ బాబు
- ●Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
- ●Tirupparankundram | భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుప్పరంకుండ్రం కొండపై డిసెంబర్ 15 దాకా దీపాలు వెలిగించొచ్చు!
- ●Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి

TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నేతల ఆందోళన.. కర్రలతో స్థానికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత

Bill Gates Warns | ఏఐతో ప్రపంచానికి సైబర్ ముప్పు.. ఆస్పత్రులు, బ్యాంకులపై హ్యాకర్ల గురి! బిల్ గేట్స్ సంచలన హెచ్చరిక

Sridhar Babu | మెట్రో స్టేషన్ల వద్ద ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గించండి..: మంత్రి శ్రీధర్ బాబు

Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!



