త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Ramakrishna Rao | రెండోసారి.. సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మ‌రో 3 నెలలు పొడిగింపు

CS Ramakrishna Rao | తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రామ‌కృష్ణారావు మ‌రో 3 నెల‌ల పాటు కొన‌సాగ‌నున్నారు. రాక‌మృష్ణారావు ప‌దవీకాలాన్ని మూడు నెల‌ల పాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ) ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Mar 18, 2026, 6.14 pm IST

CS Ramakrishna Rao | రెండోసారి.. సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మ‌రో 3 నెలలు పొడిగింపు
Advertisement

CS Ramakrishna Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రామ‌కృష్ణారావు మ‌రో 3 నెల‌ల పాటు కొన‌సాగ‌నున్నారు. రాక‌మృష్ణారావు ప‌దవీకాలాన్ని మూడు నెల‌ల పాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ) ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో జూన్ 30వ తేదీ వ‌ర‌కు సీఎస్‌గా రామ‌కృష్ణారావే కొన‌సాగ‌నున్నారు.

వాస్త‌వానికి రామ‌కృష్ణారావు ప‌ద‌వీకాలం మార్చి 31వ తేదీన ముగియనుంది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ ఆయ‌న‌నే ఈ ప‌ద‌విలో కొన‌సాగించాల‌ని కోరుతూ ఈ నెల 9న డీవోపీటీకి రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఈ లేఖ‌పై స్పందించిన కేంద్రం.. రామ‌కృష్ణారావుకే సీఎస్‌గా కొన‌సాగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రామ‌కృష్ణారావుకు ప‌ద‌వీకాలం పొడిగించడం ఇది రెండోసారి. వాస్తవానికి కె.రామకృష్ణారావు గతేడాది ఆగస్టు 31న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, ఆయన పదవీ కాలాన్ని ఏడు నెలలు పొడిగించడానికి అప్పట్లో కేంద్రం అనుమతిచ్చింది.

ఒక వేళ రామ‌కృష్ణారావుకు ప‌ద‌వీ కాలం పొడిగించ‌క‌పోతే.. ఎవ‌ర‌నే దానిపై కూడా ఉత్కంఠ ఉండే. ఈ క్ర‌మంలో ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. జ‌యేశ్ రంజ‌న్ లేదా వికాస్ రాజ్‌ల‌లో ఎవ‌ర్నో ఒక‌రిని సీఎస్ ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని భావించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement