Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ అని.. కానీ నిధులు తెచ్చి పనులు చేయడమే కష్టమని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు.
- కేటీఆర్ రైతులను రెచ్చగొడుతున్నరు
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై లెక్కలతో మాట్లాడేందుకు సిద్ధం
- కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితిపై కేటీఆర్ సమాధానం చెప్పాలి
- దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు
Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్: ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ అని.. కానీ నిధులు తెచ్చి పనులు చేయడమే కష్టమని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. కేటీఆర్ (KTR) రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై లెక్కలతో మాట్లాడేందుకు సిద్ధమన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు చేయడం సులభమని, కానీ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు తీసుకురావడం, నిధులు సమకూర్చడం, భూసేకరణ సమస్యలను పరిష్కరించడం, పనులు పూర్తి చేయడం అంత సులభం కాదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కేటీఆర్ ఒకసారి మనసాక్షిగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నమని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎవరు ఎంత ఖర్చు చేశారు? ఎంత పని పూర్తి చేశారు? ఎన్ని పంపులు ఏర్పాటు చేశారు? ఎన్ని స్టేజీల పనులు పూర్తయ్యాయి? అనే అంశాలపై బహిరంగంగా లెక్కలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు ఏ స్థాయిలో జరిగాయో కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉందన్నారు. కేవలం ఒక మోటారు ఆన్ చేసి నీటిని చూపించి మొత్తం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం అభివృద్ధి కాదని మంత్రి విమర్శించారు. పాలమూరు ప్రజలు అమాయకులు కాదని, పాలమూరు యువతకు వాస్తవాలు తెలుసన్నారు. ఎన్నికల ముందు ఒక మోటారు ఆన్ చేసి నీళ్లు చూపించి ప్రాజెక్టు పూర్తయిందని చెబితే ప్రజలు నమ్మే రోజులు పోయాయని మంత్రి ఏద్దేవా చేశారు. ప్రాజెక్టును స్టేజీల వారీగా పూర్తి చేయడం, అవసరమైన పంపులు ఏర్పాటు చేయడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం, అనుమతులు సాధించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు.
జూరాలపై రాజకీయాలొద్దు
జూరాల నీటిని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లాకు అత్యంత కీలకమైన నీటి వనరని, సాగునీటితో పాటు తాగునీరు, పశుపక్ష్యాదుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని శాస్త్రీయంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం నీటిని విడుదల చేసి రేపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురావద్దని మంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులకు సాగునీరు అందించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాకిటి పేర్కొన్నారు. పాలమూరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని మంత్రి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి
సెప్టెంబర్ 20, 2026

Bhadradri Kothagudem | ఆడుకుంటూ కారెక్కిన చిన్నారి.. అంతలోనే డోర్ లాక్.. తర్వాత ఏమైందంటే!
సెప్టెంబర్ 20, 2026

Godavarikhani Young Woman Murdered Case | మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చంపేశాడు
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?
- ●Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల
- ●Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ - ఒక్క రోజు గ్యాప్‌లో మహానటి రెండు సినిమాలు రిలీజ్
- ●Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి
- ●Bhadradri Kothagudem | ఆడుకుంటూ కారెక్కిన చిన్నారి.. అంతలోనే డోర్ లాక్.. తర్వాత ఏమైందంటే!
- ●Nayanthara | బీచ్ వెకేషన్లో నయనతార - పొట్టి డ్రెస్‌లో అందాలు అదరహో

India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?

Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల

Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ - ఒక్క రోజు గ్యాప్‌లో మహానటి రెండు సినిమాలు రిలీజ్

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి



