Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన
Global Summit | డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిబింబించేలా నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
ప్రారంభోత్సవం, క్లైమేట్ కాన్సర్ట్‌లో భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు
45కు పైగా ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు
హైదరాబాద్ ప్రత్యేక వంటకాలతో 30 ఫుడ్ స్టాళ్లు
జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు లోటు లేకుండా ఏర్పాట్లు
Global Summit | త్రినేత్ర న్యూస్ : డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిబింబించేలా నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ ఆంథమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై బుధవారం ప్రోటోకాల్, ఆహార ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీలతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌తో పాటు దివ్య, హరిచందన, కర్ణన్, అనుదీప్, వెంకట్ నర్సింహారెడ్డి, ముకుంద్ రెడ్డి, కె. లక్ష్మి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ.. డిసెంబర్ 7న సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా, అలాగే డిసెంబర్ 9న నిర్వహించే క్లైమేట్ కాన్సర్ట్‌లో భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమ్మిట్ ప్రాంగణంలో 45కు పైగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో సుమారు 30 స్టాళ్లలో హైదరాబాద్‌కు ప్రత్యేకమైన రుచులు, సంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.
డిసెంబర్ 7న ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్, ఆహారం, వసతి, రవాణా తదితర అంశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
తాజావార్తలు
- ●Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!
- ●Christmas | తెలంగాణలోని ప్రతి చర్చికి రూ. 30 వేల సాయం
- ●Actor Prabhas | ఫ్యూచర్ సిటీలో ప్రభాస్‌కు 500 ఎకరాలు..?
- ●Contract Lecturers | నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
- ●Ponguleti Srinivas Reddy | ముక్కోటి ఏకాదశి నాటికి "భద్రాద్రి"ని సిద్ధం చేస్తాం

Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?

Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!

Christmas | తెలంగాణలోని ప్రతి చర్చికి రూ. 30 వేల సాయం

Actor Prabhas | ఫ్యూచర్ సిటీలో ప్రభాస్‌కు 500 ఎకరాలు..?




