త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఐటీ షేర్ల జోరు.. స్టాక్ మార్కెట్ల‌లో లాభాలు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం, ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లతో మార్కెట్లకు మద్దతు లభించింది. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 25,900 పాయింట్ల దిగువన ట్రేడయింది. ఉదయం 9:20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 388.12 పాయింట్లు (0.46 శాతం) పెరిగి 84,326.40 వద్ద ట్రేడయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 60.75 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 25,880 వద్ద కొనసాగింది.

S

Business | Published On Nov 26, 2026, 10.45 am IST

Stock Markets | ఐటీ షేర్ల జోరు.. స్టాక్ మార్కెట్ల‌లో లాభాలు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం, ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లతో మార్కెట్లకు మద్దతు లభించింది. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 25,900 పాయింట్ల దిగువన ట్రేడయింది. ఉదయం 9:20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 388.12 పాయింట్లు (0.46 శాతం) పెరిగి 84,326.40 వద్ద ట్రేడయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 60.75 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 25,880 వద్ద కొనసాగింది. అంతర్జాతీయంగా కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత షేర్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ఐటీ రంగ షేర్ల కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి.

ఐటీ షేర్ల‌లో భారీ కొనుగోళ్లు..

రంగాల వారీగా చూస్తే ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతానికి పైగా లాభపడింది. మెటల్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల సూచీలు కూడా సానుకూలంగా ట్రేడయ్యాయి. మరోవైపు మీడియా, సిమెంట్, చమురు, గ్యాస్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో బలహీనత కనిపించింది. బుధవారం కూడా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) వరుసగా 11వ సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.4,479 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) సైతం కొనుగోళ్ల వైపు మళ్లి రూ.4,018 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

న‌ష్టాల్లో అమెరికా మార్కెట్లు..

అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. కృత్రిమ మేధ ఆధారిత షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ప్రధాన సూచీలు నష్టపోయాయి. అయితే అమెరికా థ్యాంక్స్‌గివింగ్ సెలవు నేపథ్యంలో చివరి గంటల్లో ఇన్వెస్టర్లు తక్కువ ధరలకు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ట్రేడయ్యాయి.

Advertisement
Advertisement