త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | ఆస్కార్ రేసులో రామాయ‌ణ – వీఎఫ్ఎక్స్ కేట‌గిరీలో అవెంజ‌ర్స్‌, ఒడిస్సీ సినిమాల‌తో పోటీ

రామాయ‌ణ మూవీ ఆస్కార్ 2027 రేసులో వీఎఫ్ఎక్స్ విభాగంలో టాప్ 20 లిస్ట్‌లో చోటు ద‌క్కించుకుంది. అవెంజ‌ర్స్‌, డ్యూన్ 3, ది ఒడిస్సీ లాంటి సినిమాల‌తో పోటీలో నిలిచింది. రామాయ‌ణ మూవీలో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించారు. నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మైథాల‌జీ మూవీలో య‌శ్ రావ‌ణాసురుడిగా న‌టించారు.

N

Entertainment | Published On Nov 26, 2026, 10.58 am IST

Ramayana | ఆస్కార్ రేసులో రామాయ‌ణ – వీఎఫ్ఎక్స్ కేట‌గిరీలో అవెంజ‌ర్స్‌, ఒడిస్సీ సినిమాల‌తో పోటీ
Advertisement

Ramayana  బాలీవుడ్ మూవీ రామాయ‌ణ ఆస్కార్ రేసులో నిలిచింది. వీఎఫ్ఎక్స్ విభాగంలో పోటీప‌డ‌నున్న టాప్ 20 సినిమాల జాబితాలో ఈ మైథాల‌జీ మూవీ చోటును ద‌క్కించుకుంది. ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా ఈ హిందీ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. 21 రోజుల్లోనే 1755 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇందులో రావ‌ణాసురుడిగా కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ న‌టించారు. రామాయ‌ణ గాథ ఆధారంగా నితీష్ తివారీ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

వీఎఫ్ఎక్స్‌....

రిలీజ్‌కు ముందుకు రామాయ‌ణ‌లోని వీఎఫ్ఎక్స్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. ఎఐతో సీన్స్ క్రియేట్ చేసిన‌ట్లు ఉన్నాయ‌ని, నాచురాలిటీ మిస్స‌య్యిందంటూ ట్రోల్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్ఈజీ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందించిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో వీఎఫ్ఎక్స్ లేవంటూ నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. ఈ విమ‌ర్శ‌ల‌ను ఛాలెంజింగ్‌గా తీసుకున్న మేక‌ర్స్ విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దారు. జ‌టాయువు ఎపిసోడ్‌తో పాటు లంకా న‌గ‌రం సెట్స్‌, పుష్ప‌క‌విమానం సీన్‌కు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఆస్కార్ అవార్డుల దిశ‌గా....

తాజాగా ఈ సినిమా ఆస్కార్ అవార్డుల దిశ‌గా మ‌రో ముంద‌డుగు వేసింది. వీఎఫ్ఎక్స్ విభాగంలో టాప్ 20 సినిమాల లిస్ట్‌ను ఆకాడెమీ క‌మిటీ ప్ర‌క‌టించింది. ది ఒడిస్సీ, అవెంజ‌ర్స్ డూమ్స్ డే, డ్యూన్ 3, స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, గాడ్జిల్లా మైన‌స్ జీరో, ప్రాజెక్ట్ హెయిలీ మేరీ లాంటి సినిమాల‌తో రామాయ‌ణ పోటీలో నిలిచింది. ఇందులో నుంచి టాప్ 10 సినిమాల‌ను ఆస్కార్ తుది జాబితా కోసం ఫైన‌ల్ చేస్తారు. ఈ తుది జాబితాలోనూ రామాయ‌ణ చోటు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆస్కార్ అవార్డులు 2027 మార్చి 14న జ‌రుగ‌నున్నాయి.

రెండో పార్ట్‌....

రామాయ‌ణ‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, స‌న్నీ డియోల్‌, వివేక్ ఒబెరాయ్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రెండు భాగాలుగా రామాయ‌ణ మూవీ రూపొందుతోంది. రెండో పార్ట్ 2028లో రిలీజ్ కాబోతుంది.

 

 

Advertisement
Advertisement