John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు
John Wesley | వారానికి 5 రోజులు పని విధానాన్ని అమలు చేయాలని, పీఎల్ఐ పథకం అమలులో ఏకపక్ష ధోరణి, 12వ వేతన ఒప్పందంలోని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి యుఎఫ్‌బీయు తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు తెలుపుతున్నట్లు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెల్లడించారు.
John Wesley | త్రినేత్ర న్యూస్ : వారానికి 5 రోజులు పని విధానాన్ని అమలు చేయాలని, పీఎల్ఐ పథకం అమలులో ఏకపక్ష ధోరణి, 12వ వేతన ఒప్పందంలోని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి యుఎఫ్‌బీయు తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు తెలుపుతున్నట్లు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెల్లడించారు. బ్యాంక్ ఉద్యోగ, అధికారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న ఈ 3 రోజుల సమ్మెను రాష్ట్ర కార్మికవర్గమంతా విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2023లో కుదిరిన ఒప్పందాలను ఆమోదించకుండా, బ్యాంకుల లాభాల ఆధారంగా ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లలో ఏకపక్ష మార్పులు చేస్తూ ఉద్యోగుల్లో కేంద్ర ప్రభుత్వం విభజన సృష్టిస్తోంది. గత 60 సంవత్సరాలుగా అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలను విచ్ఛిన్నం చేస్తూ, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఉద్యోగుల ఉపాధికి భద్రత లేకుండా పోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను శరవేగంగా ప్రైవేటుపరం చేస్తూ, 28 బ్యాంకులను 12కి కుదించడంతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని యత్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలను కార్మికవర్గం ఏకోన్ముఖంగా ప్రతిఘటించాలని ప్రజలకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది జాన్ వెస్లీ తెలిపారు.
తాజావార్తలు
- ●MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!
- ●KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్
- ●Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
- ●PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!

KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్

Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!




