Kunamneni Sambasiva Rao | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి.. సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే కూనంనేని లేఖ
Kunamneni Sambasiva Rao | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. సాంకేతిక కారణాలు, నాణ్యతా ప్రమాణాల పేరుతో కాలయాపన చేయకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన కోరారు.
Kunamneni Sambasiva Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. సాంకేతిక కారణాలు, నాణ్యతా ప్రమాణాల పేరుతో కాలయాపన చేయకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన కోరారు.
లేఖ సారాంశం ఇదే..
రైస్ మిల్లులకు ధాన్యంతో వెళ్ళిన లారీలు సకాలంలో ఖాళీ కాకపోవడంతో వరి ధాన్యం కొనుగోలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ధాన్యం లోడ్ చేయడానికి లారీ ఓనర్లు భయపడుతున్నారు. కాంటా వేసిన ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు లారీల కొరత ఏర్పడంతో కొనుగోలు సెంటర్లలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తిగా మందగించింది. ఫలితంగా రైతులు ధాన్యంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. అలాగే ధాన్యంలో తాలు ఉందని, నాణ్యత లేదనే పేరుతో అనేక కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకుండా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా రైతులు తీసుకెళ్ళిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి పోతున్నాయి. అలాగే కొన్నిచోట్ల రాశులుగా పోసిన ధాన్యం వరదకు కొట్టుకపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాపితంగా మొక్కజొన్న పంట కొనుగోలులో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. మార్కెట్ యార్డులలో మొక్కజొన్నలు కొనుగోలు నిలిచిపోవడంతో గత కొన్ని రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు.. కొనుగోలుకు గన్నీ సంచుల కొరత కూడా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి. వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలను కొనుగోలులో తలెతుత్తున్న సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకొని యుద్ధప్రాతిపదికన కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నాను.
అభివందనములతో...
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



