CPGET | సీపీగెట్ అప్లికేషన్లు షురూ.. జూలై మొదటివారంలో ప్రవేశ పరీక్ష..
CPGET | పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీపీగెట్ (CPGET) దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జూన్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CPGET | త్రినేత్ర.న్యూస్: పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీపీగెట్ (CPGET) దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జూన్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నది. అయితే తొలిసారిగా కాకతీయ యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 7 సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్ (JNTUH), కొత్తగూడెం ఎర్త్‌సైన్సెస్ వర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేపట్టనున్నారు. ఎలాంటి ఫైన్ లేకుండా జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 వేల ఆలస్య రుసుంతో 18 వరకు అవకాశం కల్పించారు. జూలై మొదటి వారంలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు తొలి వారంలో తరగతుల ప్రారంభం కానున్నాయి.
- ఆన్‌లైన్ దరఖాస్తులు: మే 15
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
- రూ.500 ఫైన్‌తో: జూన్ 14
- రూ.2000 ఫైన్‌తో: జూన్ 18
- కరెక్షన్ విండో: జూన్ 16 నుంచి 19 వరకు
- అడ్మిట్ కార్డులు: జూన్ 28
- ప్రవేశ పరీక్ష: జూలై మొదటి వారంలో
- ప్రాథమిక కీ: జూలై 17
- ప్రాథమిక కీపై అభ్యంతరాలు: జూలై 17 నుంచి 19 వరకు
- సీపీగెట్ ఫలితాలు: జూలై చివరి వారంలో
- ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్: జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో
- వెబ్‌సైట్: cpget.tgche.ac
సంబంధిత వార్తలు

Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు
జులై 11, 2026

Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
జులై 11, 2026

CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
జులై 11, 2026
తాజావార్తలు
- ●Tollywood | ఏపీ ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ - లక్ష్మి ప్రణతి లుక్ రిలీజ్
- ●Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు
- ●Anirudh - Kavya Maran | అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా?
- ●Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
- ●CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Tollywood | ఏపీ ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ - లక్ష్మి ప్రణతి లుక్ రిలీజ్

Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు

Anirudh - Kavya Maran | అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా?

Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం



