త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sagar Canal | సాగ‌ర్ కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు.. దంప‌తులు గ‌ల్లంతు

Sagar Canal | నల్ల‌గొండ (Nalgonda) జిల్లా నిడ‌మ‌నూరు మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మండ‌లంలోని ముకుందాపురంలో సాగర్‌ ఎడమ కాలువ‌లోకి (Sagar Canal) కారు దూసుకెళ్లింది.

G

Telangana | Published On Feb 8, 2026, 11.09 am IST

Sagar Canal | సాగ‌ర్ కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు.. దంప‌తులు గ‌ల్లంతు
Advertisement

Sagar Canal | త్రినేత్ర‌.న్యూస్‌: నల్ల‌గొండ (Nalgonda) జిల్లా నిడ‌మ‌నూరు మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మండ‌లంలోని ముకుందాపురంలో సాగర్‌ ఎడమ కాలువ‌లోకి (Sagar Canal) కారు దూసుకెళ్లింది. శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కారులో ప్ర‌యాణిస్తున్న పుల్ల‌య్య‌, ప‌ద్మ దంప‌తులు గ‌ల్లంత‌య్యారు. వారిని త్రిపురారం మండ‌లం కంపాసాగ‌ర్‌కు చెందిన వారిగా గుర్తించారు. గ‌ల్లంత‌యిన‌వారి కోసం రాత్రి గాలించిన‌ప్ప‌టికీ ఆచూకీ ల‌భించ‌లేదు. దీంతో ఆదివారం ఉదయమూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

Advertisement
Advertisement