Boring Guda | ఆ ఊరిపేరు బోరింగ్ గూడ.. కొట్టకుండానే చేతి పంపు నుంచి ఉబికి వస్తున్న నీరు.. వీడియో
Boring Guda | ఆ గ్రామం పేరు బోరింగ్ గూడ (Boring Guda).. ఇలాంటి పేరు ఎలా వచ్చిందని అనుకుంటున్నారా?. దానికి ఓ చరిత్ర ఉంది. ఈ ఊర్లో ఉన్న చేతి పంపును ఎవరూ కొట్టాల్సిన పని లేదు.
Boring Guda | త్రినేత్ర.న్యూస్: ఆ గ్రామం పేరు బోరింగ్ గూడ (Boring Guda).. ఇలాంటి పేరు ఎలా వచ్చిందని అనుకుంటున్నారా?. దానికి ఓ చరిత్ర ఉంది. ఈ ఊర్లో ఉన్న చేతి పంపును ఎవరూ కొట్టాల్సిన పని లేదు. భూమిలోనుంచి నీరు వాటంతట అవే ఉబికి వస్తూనే ఉంటాయి. రోజులు కాదు, నెలలు కాదు.. ఏండ్లుగా అలా నిరంతరాయంగా నీటి ధార వస్తూనే ఉంది. అందుకే ఆ పేరు వచ్చింది.
ఆదిలాబాద్ రూరల్ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని ఓ ప్రాంతంలో సుమారు 50 ఏండ్ల కింద తాగునీటి కోసం ఓ బోరు వేశారు. దానికి బోరింగు బిగించారు. అయితే ఆ చేతి పంపును కొట్టాల్సిన పనిలేకుండానే.. నీటి ధార నిరంతరం ఉబికి వస్తూనే ఉందది. దీంతో ఆ ప్రాంతానికి బోరింగ్ గూడ అని పేరు వాడుకలోకి వచ్చింది.
దానికి తగినట్లుగానే ఇన్నేండ్లలో ఏ రోజూ ఆ పంపు నుంచి నీటి ధార ఆగలేదని స్థానికులు చెప్పారు. అలా వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు అక్కడే ఓ పెద్ద ట్యాంకును నిర్మించారు. అందులోకి నీటిని మళ్లించి గ్రామప్రజలు వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు కూడా ఈ నీటిని మోటార్ల సహాయంతో మళ్లించుకుంటున్నారు. ఇక్కడ కోలం ఆదివాసీలు మాత్రమే నివసిస్తూ ఉంటారు.
(వీడియో.. బీబీసీ సౌజన్యంతో..)
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






