త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Election Results | 1200కుపైగా వార్డుల్లో ఫ‌లితాలు.. దేవరకద్రలో ఏ పార్టీకి రాని మ్యాజిక్‌ ఫిగర్‌

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Election Results) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలోని 116 పురపాలికల్లోని 2582 వార్డుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 1298 చోట్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. వాటిలో కాంగ్రెస్ 704 వార్డుల్లో విజ‌యం సాధించ‌గా, బీఆర్ఎస్ 380, బీజేపీ 110, ఇత‌రులు 104 చోట్ల గెలుపొందారు.

G

Telangana | Published On Feb 13, 2026, 12.03 pm IST

Municipal Election Results | 1200కుపైగా వార్డుల్లో ఫ‌లితాలు.. దేవరకద్రలో ఏ పార్టీకి రాని మ్యాజిక్‌ ఫిగర్‌
Advertisement

Municipal Elections | త్రినేత్ర.న్యూస్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Election Results) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలోని 116 పురపాలికల్లోని 2582 వార్డుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 1298 చోట్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. వాటిలో కాంగ్రెస్ 704 వార్డుల్లో విజ‌యం సాధించ‌గా, బీఆర్ఎస్ 380, బీజేపీ 110, ఇత‌రులు 104 చోట్ల గెలుపొందారు.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక మున్సిపాలిటీల‌ను చేజిక్కించుకోగా, బీఆర్ఎస్ పార్టీ కూడా అధికార‌పార్టీకి త‌గిన పోటీ ఇస్తున్న‌ది. కాగా, మ‌హబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో (Devarakadra) ఫ‌లితం తేల‌లేదు. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను (Magic Figure) దాట‌లేక‌పోయాయి. మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ 6 చోట్ల గెలుపొంద‌గా, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, ఇతరులు 1 స్థానంలో విజ‌యం సాధించారు. దీంతో ఎక్స్​అఫీషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవ‌రో ఒక‌రు చైర్మ‌న్ ప‌ద‌విని గెలుచుకునే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకున్న‌ది. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 6, ఇతరులు 1 చోట గెలుపొందారు. జిల్లాలో ఇప్ప‌టికే డోర్న‌క‌ల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపొంద‌గా, తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ ద‌క్కించుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement