త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్ ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా

KCR | మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేప‌ట్టారు. త‌క్ష‌ణ‌మే కేసీఆర్ అసెంబ్లీ (Assembly)కి వెళ్లి గ‌జ్వేల్ (Gajwel) ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మాట్లాడాలంటూ నిన‌దించారు. సారూ అసెంబ్లీకి రావా.. బ‌య‌టికి రావా అని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

A

Telangana | Published On Jan 4, 2026, 4.03 pm IST

KCR | కేసీఆర్ ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేప‌ట్టారు. త‌క్ష‌ణ‌మే కేసీఆర్ అసెంబ్లీ (Assembly) కి వెళ్లి గ‌జ్వేల్ (Gajwel) ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మాట్లాడాలంటూ నిన‌దించారు. సారూ అసెంబ్లీకి రావా.. బ‌య‌టికి రావా అని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. కేసీఆర్ బ‌య‌ట‌కు రావాలంటూ రెడ్‌కార్పెట్ ప‌రిచి, పూలు చ‌ల్లి ఆహ్వానించారు. అసెంబ్లీకి వెళ్ల‌కుంటే వెంట‌నే కేసీఆర్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుత శీతాకాల అసెంబ్లీ స‌మావేశాలకు హాజ‌ర‌వుతార‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తార‌ని ఆశించిన‌ప్ప‌టికీ నిరాశే ఎదురైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొద‌టిరోజు మాత్ర‌మే హాజ‌రై వెనుదిరిగార‌ని అన్నారు.

గ‌జ్వేల్ ప్ర‌జ‌లు గెలిపించింది నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుక‌ని చెప్పారు. కానీ కేసీఆర్ అదిమ‌రిచి, వ్య‌వ‌సాయం చేసుకుంటూ, ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేశార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చే ఆస‌క్తి లేక‌పోతే స్వ‌చ్ఛందంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, మ‌రొక‌రికి అవకాశం క‌ల్పించాల‌ని కోరారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జాప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తోంద‌ని అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్ర‌భుత్వం దృష్టికి స‌మ‌స్య‌లు తీసుకుపోకుండా అవి ఎలా ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టికైనా కేసీఆర్ బ‌య‌ట‌కు రావాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి హాజ‌రై నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో ప్ర‌స్తావించి, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకుపోవాల‌ని కోరారు. అప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట న‌ర్సారెడ్డి, మ‌హిళా కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షురాలు ఆంక్ష‌రెడ్డి, స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement