త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | కాంగ్రెస్‌దే హ‌వా.. కానీ! ప‌ట్ట‌ణాల్లో ప‌ట్టు స‌డ‌లుతున్న హ‌స్తం..!!

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్టు పీపుల్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన స‌ర్వే తెలిపింది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేష‌న్ల‌కు బుధ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 68-76 వ‌ర‌కు మున్సిపాలిటీలు, అయిదు కార్పొరేష‌న్ల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు ఆ సంస్థ ప్ర‌క‌టించింది.

S

Telangana | Published On Feb 11, 2026, 7.47 pm IST

Municipal Elections | కాంగ్రెస్‌దే హ‌వా.. కానీ! ప‌ట్ట‌ణాల్లో ప‌ట్టు స‌డ‌లుతున్న హ‌స్తం..!!
Advertisement

గెలిచేది స‌గం మున్సిపాలిటీలేనా?
5 కార్పొరేష‌న్లు గెలిచే చాన్స్
అర్బ‌న్‌లో పుంజుకున్న బీజేపీ
2 కార్పొరేష‌న్లు చేజిక్కించుకునే చాన్స్‌
కార్పొరేష‌న్ల రేసులో బీఆర్ఎస్‌ జీరో
29.7 శాతం ఓట్ల‌తో ప‌రువు ద‌క్కించుకున్న కారు
36 శాతం ఓట్ల‌తో టాప్‌లో కాంగ్రెస్
60 పైబ‌డిన వారంతా బీఆర్‌ఎస్ వైపే
పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వేలో వెల్ల‌డి

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్ : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్టు పీపుల్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన స‌ర్వే తెలిపింది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేష‌న్ల‌కు బుధ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 68-76 వ‌ర‌కు మున్సిపాలిటీలు, అయిదు కార్పొరేష‌న్ల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. బీజేపీ రెండు కార్పొరేష‌న్లు గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌ర్వేలో తేలింది. మ‌రోవైపు బీఆర్‌ఎస్ ఒక్క కార్పొరేష‌న్‌ను కూడా ద‌క్కించుకునే ప‌రిస్థితి లేద‌ని తెలిపింది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట్ల ప‌రంగా, సీట్ల ప‌రంగా పుంజుకుని, రెండు కార్పొరేష‌న్ల‌ను ద‌క్కించుకోనున్న‌ట్టు పీపుల్స్ ప‌ల్స్ ప్ర‌క‌టించింది.

36 శాతం కాంగ్రెస్‌.. 29.7 శాతం బీఆర్ఎస్

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల‌కు గాను కాంగ్రెస్ 68-76 మున్సిపాలిటీలు తెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు పీపుల్స్ ప‌ల్స్ ప్ర‌క‌టించింది. 29-36 బీఆర్‌ఎస్, 3-5 బీజేపీ గెల‌వ‌వ‌చ్చ‌ని తెలిపింది. అయితే.. మొత్తం 2996కు గాను దాదాపు 1290కి పైగా వార్డుల‌ను కాంగ్రెస్, 930 వ‌ర‌కు బీఆర్ఎస్‌ గెలుచుకోనున్న‌ట్టు అంచ‌నా వేసింది. కాగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మొత్తం ఓట్ల‌లో 36 శాతం కాంగ్రెస్‌కు, 29.7 శాతం బీఆర్‌ఎస్‌కు, 19.3 శాతం బీజేపీకి ద‌క్క‌నున్న‌ట్టు తెలిపింది.

ప‌ట్టు స‌డ‌లుతోందా

మున్సిప‌ల్ సీట్ల‌తో నిమిత్తం లేకుండా ఆయా వార్డుల్లో ప‌డిన ఓట్ల‌ను విశ్లేషిస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీకి 36 శాతం ఓట్లు మాత్ర‌మే రావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న‌ది. అదే స‌మ‌యంలో బీఆర్‌ఎస్ 29.7 శాతం ఓట్లు ద‌క్కించుకొని త‌న ఓటు బ్యాంకును ప‌దిలంగా ఉంచుకున్న‌ది. కానీ.. ఒక్క కార్పొరేష‌న్ కూడా గెలుచుకోలేక న‌గ‌రాల్లో కారు చ‌తికిపడింది.

వృద్ధులు గులాబీవైపే..

అర‌వైఏళ్ల పైబ‌డిన ఓట‌ర్ల‌లో అత్య‌ధికులు బీఆర్ఎస్‌వైపు మొగ్గు చూపిన‌ట్లు స‌ర్వేలో తేలింది. వృద్ధుల్లో 36.5 శాతం మంది బీఆర్ఎస్‌కు ఓటు వేయ‌గా, 33.7 శాతం మంది అధికార పార్టీ వైపు నిలిచారు. వివిధ ఏజ్ గ్రూప్‌ల‌లో 36-45 ఏళ్ల మ‌ధ్య ఉన్న‌వారిలో అత్య‌ధికంగా కాంగ్రెస్‌కు 37.3 శాతం ఓటేశారు. అధికార పార్టీకి మ‌హిళ‌లు(36.7 శాతం), పురుషులు(36.1 శాతం) దాదాపు స‌రిసమానంగా ఓటేసిన‌ట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీకి అయితే మ‌హిళ‌ల ఓటు శాత‌మే(31.5 శాతం) అధికంగా ఉండ‌గా, పురుషుల ఓటు శాతం(29.1 శాతం) త‌క్కువ‌గా ఉంది. బీజేపీ వైపు పురుషులు(20.4 శాతం) మొగ్గు చూప‌గా, మ‌హిళ‌లు(18.5 శాతం) పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు.

మున్సిపాలిటీలు ఇలా..

కాంగ్రెస్ పార్టీ 68-76
బీఆర్ఎస్ 29-36
బీజేపీ 3-5
ఎంఐఎం 0-1

వార్డులు ఇలా..

కాంగ్రెస్ 1210-1290
బీఆర్ఎస్ 860-930
బీజేపీ 250-270
ఎంఐఎం 35-44
సీపీఐ 12-17
సీపీఎం 10-14

మున్సిపాలిటీల్లో ఓటు షేరింగ్ ఇలా..

కాంగ్రెస్ పార్టీ - 36.0 శాతం
బీఆర్ఎస్ 29.7 శాతం
బీజేపీ 19.3 శాతం
ఎంఐఎం - 2.0 శాతం
సీపీఐ - 2.0 శాతం
సీపీఎం - 1.2 శాతం
ఇత‌రులు - 9.7 శాతం

కార్పొరేష‌న్ల‌లో వార్డులు ఇలా..

నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్

బీజేపీ 26 - 31
కాంగ్రెస్ 10-16
బీఆర్ఎస్ 2-4
ఎంఐఎం 8-12

క‌రీంన‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్

కాంగ్రెస్ 24-29
బీజేపీ 14-16
బీఆర్ఎస్ 1-12

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్

కాంగ్రెస్ 26-30
బీఆర్ఎస్ 18-22
బీజేపీ 6-8
ఎంఐఎం 2-4

మంచిర్యాల మున్సిప‌ల్ కార్పొరేష‌న్

కాంగ్రెస్ 39-43
బీఆర్ఎస్ 8-12
బీజేపీ 6-9

రామ‌గుండం మున్సిప‌ల్ కార్పొరేష‌న్

కాంగ్రెస్ 30-34
బీఆర్ఎస్ 16-20
బీజేపీ 3-6

న‌ల్ల‌గొండ మున్సిప‌ల్ కార్పొరేష‌న్

కాంగ్రెస్ 21-26
బీఆర్ఎస్ 8-12
బీజేపీ 6-10
ఎంఐఎం 2-4

కొత్త‌గూడెం మున్సిప‌ల్ కార్పొరేష‌న్

కాంగ్రెస్ 28-34
సీపీఐ 14-16
బీఆర్ఎస్ 7-9
సీపీఎం 1-2

Advertisement
Advertisement